పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ (BJP) ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. ఎంపీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్న నియోజక వర్గాలలో విస్తృతంగా కీలక నేతలు సభలు, సమావేశాలు నిర్వహించడం కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర రక్షణ శాఖమంత్రి (Union Defense Minister) రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు..
బీఆర్ఎస్ (BRS) సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందని ఆరోపించారు.. తెలంగాణ (Telangana) దక్షిణ భారత దేశానికి గేట్ వే లాంటిదని తెలిపిన రక్షణ శాఖమంత్రి.. మోడీ (Modi) నేతృత్వంలో దేశంలో ఒక్క అవినీతి జరగలేదని పేర్కొన్నార. భారత్ ఆర్థిక వ్యవస్థలో 2027 వరకు ప్రపంచంలోనే మూడోస్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంతుష్టికరణ విధానాలను అవలంభిస్తోందని విమర్శించిన రాజ్ నాథ్ సింగ్ బీజేపీ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ హయాంలో భవ్యమైన రామ మందిరం నిర్మించి.. ప్రాణ ప్రతిష్ట చేశామని.. అలాగే జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్.. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినట్లు వివరించారు. ముస్లిం సమాజంలోని మహిళలకు విముక్తి కలిగించామని అన్నారు..
బీజేపీ రాజనీతి పార్టీ అని తెలిపిన రాజ్ నాథ్ సింగ్.. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజనీతి పార్టీలు కాదు, అవినీతి పార్టీలని విమర్శించారు.. కాంగ్రెస్ ప్రధానులు పేదరికాన్ని పెంచి పోషించారని తెలిపిన ఆయన.. పేదరికం నుంచి 15 కోట్ల మంది ప్రజానికాన్ని బీజేపీ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.. అలాగే మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించినట్లు గుర్తు చేశారు..
అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించి స్వదేశంలో అన్ని ఉత్పత్తి చేసుకొనే స్థాయికి ఎదిగినట్లు తెలిపారు.. మరోవైపు కిషన్ రెడ్డి నామినేషన్ కోసం నగరానికి వచ్చానని తెలిపిన రాజ్ నాథ్ సింగ్.. సికింద్రబాద్ లో ఆయన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. అలాగే ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా అద్భుతంగా పని చేశారని.. వీరిద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు..