Telugu News » Ram Gopal Varma : బర్రెలక్కపై నోరుజారిన రామ్ గోపాల్ వర్మ..!!

Ram Gopal Varma : బర్రెలక్కపై నోరుజారిన రామ్ గోపాల్ వర్మ..!!

ఉన్నతంగా ఎదగాలని చూస్తున్న తమ ప్రాంత బిడ్డను కించపరిచేలా మాట్లాడటం తప్పు అని వెల్లడించిన శిరీష తరఫు న్యాయవాది.. అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని న్యాయవాది స్పష్టం చేశారు.

by Venu
barrelkka

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)పై కేసు నమోదైయ్యింది. కేసులు ఆయనకి కొత్త ఏం కాదు.. కానీ ఈసారి కేసు పెట్టింది బర్రెలక్క (Barrelakka)గా ఫేమస్ అయిన శిరీష (Sirisha).. వర్మపై గురువారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆర్జీవీ వ్యూహం (Vyuham) మూవీ (Movie) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో ఊరు.. పేరు లేని ఆవిడ.. బర్రెలక్కగా చాలా ఫేమస్‌ అయిపోయింది.. అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినట్టు తెలిపారు..

ఉన్నతంగా ఎదగాలని చూస్తున్న తమ ప్రాంత బిడ్డను కించపరిచేలా మాట్లాడటం తప్పు అని వెల్లడించిన శిరీష తరఫు న్యాయవాది.. అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని న్యాయవాది స్పష్టం చేశారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు..

మరోవైపు రామ్‌గోపాల్‌ వర్మ వ్యూహం సినిమాపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అదీగాక వ్యూహం మూవీపై జనసేన, టీడీపీ నేతలు, ఆర్టీవీ మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన నేత పవన్‌ను విమర్శించే ప్రయత్నంలో.. రామ్ గోపాల్ వర్మ, బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష పేరును వాడుకోవడం వివాదంగా మారింది..

You may also like

Leave a Comment