Telugu News » Ram Mandir: అయోధ్యలో భక్త జనసందోహం.. తోపులాట..!

Ram Mandir: అయోధ్యలో భక్త జనసందోహం.. తోపులాట..!

తొలి రోజు రాంలల్లా(Ram Lala)ను దర్శించుకునేందుకు రామ భక్తులు భారీగా తరలివచ్చారు.రామనామంతో అయోధ్య నగరం మార్మోగిపోతుంది. అయితే అయోధ్య రామమందిరంలో తోపులాట జరిగినట్లు పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

by Mano
Ram Mandir: Crowd of devotees in Ayodhya

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సోమవారం పూర్తి కాగా నేటి నుంచి శ్రీరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించారు. దీంతో తొలి రోజు రాంలల్లా(Ram Lala)ను దర్శించుకునేందుకు రామ భక్తులు భారీగా తరలివచ్చారు.

Ram Mandir: Crowd of devotees in Ayodhya

తెల్లవారుజామున 3గంటల నుంచే భక్తులు పెద్దసంఖ్యలో రామాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహంతో కిటకిటలాడుతుంది. రామనామంతో అయోధ్య నగరం మార్మోగిపోతుంది. అయితే అయోధ్య రామమందిరంలో తోపులాట జరిగినట్లు పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, తొలి రోజు అయోధ్య రామాలయాన్ని దాదాపు 5 లక్షల మంది భక్తులు సందర్శించుకునే అవకాశం ఉందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బోర్డు అంచనా వేసింది. రామ భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని పేర్కొన్నారు.

ఆలయంలో రెండుసార్లు హారతిని ఇస్తారని, ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ బోర్డు వెల్లడించింది. సామాన్య భక్తులకు నేటి నుంచి దర్శనభాగ్యం కల్పించడంతో పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

You may also like

Leave a Comment