Telugu News » Ranjith Reddy : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. చేవెళ్ల రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్..!

Ranjith Reddy : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. చేవెళ్ల రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్..!

చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించిన సునీత మహేందర్ రెడ్డికి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ వైపు కాంగ్రెస్ చూపు మళ్లిందని అనుకొంటున్నారు. కాంగ్రెస్ చేసిన సర్వేలలో సునీతకు ఫలితం సానుకూలంగా రాలేదని సమాచారం..

by Venu

తెలంగాణ (Telangana) రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.. ఒకప్పుడు బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందో.. ప్రస్తుతం అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకొంటున్నారు.. పదవులు లేకుండా ఉండలేని నేతలు.. వాటి కోసం ఒంటి మీది చొక్కా మార్చినట్లు పార్టీలు మారడం ప్రస్తుతం రాష్ట్రంలో బిగ్ స్క్రీన్ లో కనిపిస్తుందంటున్నారు.. అయితే ఈ సీజన్ లో బీఆర్ఎస్ బిత్తరపోయే పరిస్థితులు నెలకొన్నట్లు టాక్..

గురువు నేర్పిన విద్య శిష్యులు తూచ తప్పకుండా ఆచరించినట్లు.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ (KCR) ఐడియాలజీని ఆదర్శంగా తీసుకొన్నట్లు కనిపిస్తుందని అనుకొంటున్నారు.. ఫలితంగా కారు సీట్లు రోజు రోజుకు తగ్గిపోవడం కనిపిస్తోంది. పెద్దబాస్ ను ఈ విషయం కలవరపెడుతున్నా.. తాను నేర్పిన తంత్రాలు కాబట్టి నోరుమేదిపితే పరువు పోతుందని అనుకొంటున్నట్లు చర్చించుకొంటున్నారు..

ఇదిలా ఉండగా ప్రస్తుతం రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొన్నట్లు ముచ్చటించుకొంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy), వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణరెడ్డి కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్నారు.

అదేవిధంగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించిన సునీత మహేందర్ రెడ్డికి షాక్ తగిలింది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ వైపు కాంగ్రెస్ చూపు మళ్లిందని అనుకొంటున్నారు. కాంగ్రెస్ చేసిన సర్వేలలో సునీతకు ఫలితం సానుకూలంగా రాలేదని, రంజిత్ రెడ్డి (Ranjith Reddy)కి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది.

దీంతో అయనకు దాదాపుగా కాంగ్రెస్ టికెట్ ఖరారు అయినట్టు తెలుస్తుంది. టికెట్ కన్ఫామ్ కాగానే నేడో రేపో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా 2014 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి వలస వెళ్ళిన యాదయ్య ప్రస్తుతం సొంతగూటికి చేరే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. యాదయ్య ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment