Telugu News » Ration Card: రేషన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఈ-కేవైసీ లాస్ట్‌డేట్‌ ఎప్పుడంటే..?

Ration Card: రేషన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఈ-కేవైసీ లాస్ట్‌డేట్‌ ఎప్పుడంటే..?

రాష్ట్రంలో రేషన్‌కార్డు(Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్‌డేట్‌ ఇచ్చింది. లబ్ధిదారులు కేవైసీని సమర్పించేందుకు జనవరి 31 వరకు తుదిగడువు ఇచ్చింది.

by Mano
Ration Card: Alert for ration card holders.. When is e-KYC last date..?

రాష్ట్రంలో రేషన్‌కార్డు(Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్‌డేట్‌ ఇచ్చింది. రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియ త్వరలో ముగియనున్నట్లు వెల్లడించింది. లబ్ధిదారులు కేవైసీని సమర్పించేందుకు జనవరి 31 వరకు తుదిగడువు ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Ration Card: Alert for ration card holders.. When is e-KYC last date..?

2014 నుంచి రాష్ట్రంలో రేషన్‌ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేషన్‌ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేతతోపాటు, సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నో యువర్‌ కస్టమర్‌’ (KYC) పేరుతో రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 70.80 శాతం ఈ-కేవైసీ పూర్తయింది. ఇందులో 87.81 శాతంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 54.17శాతం వనపర్తి జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈనేపథ్యంలో కేవైసీకి తుదిగడువు విధిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.

రెండు నెలలుగా రేషన్‌ దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. దీనికోసం ఆధార్‌ కార్డు, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. అయితే తొమ్మిదేళ్లలో ఎంతో మంది మృతిచెందగా, మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని కొత్త కాపురం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో రేషన్‌ బియ్యం పక్కదారిపట్టకుండా ప్రభుత్వం కేవైసీ నిర్వహిస్తున్నది. ప్రస్తుతం రేషన్‌కార్డుల్లో పేరున్నవారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది.

You may also like

Leave a Comment