Telugu News » Ravi Shastri: ఆ ఇద్దరూ బలంగా తిరిగివస్తారు: రవిశాస్త్రి

Ravi Shastri: ఆ ఇద్దరూ బలంగా తిరిగివస్తారు: రవిశాస్త్రి

క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజమేనని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) అన్నారు. బీసీసీఐ(BCCI) సెంట్రల్ కాంట్రాక్టును దక్కించుకోవడంలో ఇషాన్ కిషన్(Ishan Kishan), శ్రేయస్‌ అయ్యర్(Shreyas Iyer) విఫలమయ్యారు.

by Mano
Ravi Shastri: Those two will come back strong: Ravi Shastri

క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజమేనని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) అన్నారు. బీసీసీఐ(BCCI) సెంట్రల్ కాంట్రాక్టును దక్కించుకోవడంలో ఇషాన్ కిషన్(Ishan Kishan), శ్రేయస్‌ అయ్యర్(Shreyas Iyer) విఫలమయ్యారు. ఈ క్రమంలో రవిశాస్త్రి ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Ravi Shastri: Those two will come back strong: Ravi Shastri

దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడం వల్లే వారికి అవకాశం కల్పించలేదని తెలిపారు. అదేవిధంగా క్రికెట్‌లో ఇలాంటవన్నీ సహజమేనని, స్ఫూర్తితో పునరాగమనం చేయాలన్నారు. ‘శ్రేయస్, ఇషాన్ బాధపడొద్దు. జాతీయ జట్టులోకి ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని వచ్చారు. ఇప్పుడు మరింత బలంగా పుంజుకోవాలి. గతంలో సాధించిన లక్ష్యాలు విలువల గురించి చెబుతాయి.

మీరు మళ్లీ పైకి ఎదుగుతారనే నమ్మకం నాకుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు. మరోవైపు యువ క్రికెటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. శ్రేయస్, ఇషాన్‌తో పాటు పుజారా, రహానె, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, చాహల్‌కూ అవకాశం దక్కలేదు. శ్రేయస్, ఇషాన్ దేశవాళీలో ఆడకపోవడం వల్లే ఇవ్వలేదని వాదనపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీసీసీఐ పక్షపాతం చూపిస్తోందని కామెంట్లు చేశారు. రంజీ మ్యాచ్ల్‌లనే పక్కన పెట్టేసిన హార్దిక్ పాండ్యకు కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ మాత్రం కేవలం ఒక్క మ్యాచ్‌ను మిస్ అయినందుకే తొలగించడం అన్యాయం అని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ప్రపంచ కప్‌లో 10 మ్యాచులకుగాను 500+ స్కోరు చేసిన ఆటగాడికి కాంట్రాక్ట్ ఇవ్వలేదని, అతడికి మద్దతుగా ఉంటామంటున్నారు.

You may also like

Leave a Comment