వెనకటికి ఒకరు పెళ్ళికాక ముందే పుస్తెలు మట్టెలు కొన్నాడట.. ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) వ్యవహారాన్ని చూస్తున్న వారు అనుకుంటున్నారు. ఇంకా ఎన్నికలు జరగలేదు.. రిజల్ట్ రాలేదు.. మరోవైపు ప్రత్యర్థిగా ఉన్నది కేసీఆర్ (KCR)కాకా.. ఇండియా మీద హోప్ పెట్టుకుని ఆస్ట్రేలియాను తక్కువచ్చేసినట్టు ఇప్పుడు సీఎం (CM) సీటు కోసం మాట్లాడితే చావు తప్పి కన్ను లొట్టపోవడం ఖాయమని కామన్ మ్యాన్.. హస్తం పార్టీలో జరుగుతున్న చర్చను చూసి హెచ్చరిస్తున్నాడట..
అయినా ఇక్కడ వినేవారెవ్వరు.. కాంగ్రెస్ లో అంతా ముఖ్యమంత్రులే.. దాదాపు ఆరడజను మంది పైగా సీనియర్ నేతలు సీఎం పోస్ట్‌పై ఆశలు పెట్టుకున్న వారే.. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌లో సీఎం పోస్ట్‌పై చర్చ ఊపందుకుందని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిపై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న రేణుకా చౌదరి (Renuka Chaudhary) సీఎం పీఠం పై కీలక వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం పదవిని ఆశించి వచ్చని.. దాంట్లో తప్పేమి లేదన్నారు.. కానీ సీఎం ఎవరనేది అధిష్టానం చేతిలో ఉందని తెలిపారు.. హై కమాండ్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.
మరోవైపు కర్నాటకలో జరిగిన రాజకీయ మలుపు గురించి ప్రస్తావించిన రేణుకా చౌదరి.. అక్కడ డీకే శివకుమార్ సీఎం అవుతాడాని అంతా భావించారు.. కానీ అధిష్టానం సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు.
కర్నాటక (Karnataka)లో కాంగ్రెస్ విజయం సాధించడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించినప్పటికీ.. సీఎం పదవిని త్యాగం చేశారని వెల్లడించారు రేణుకా చౌదరి.. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రావడం ఖాయమని రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. అంటే తెలంగాణలో సీఎం రేవంత్ కాదా? అని కార్యకర్తలు అనుకుంటున్నారు..