Telugu News » Republic Day 2024 Celebration: రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు..!

Republic Day 2024 Celebration: రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు.. ఆకట్టుకున్న శకటాలు..!

కర్తవ్యపథ్‌(Karthavya Path)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), ఇతర ప్రముఖులు, ప్రజలు ఈ వేడుకలో భాగమయ్యారు.

by Mano
Republic Day 2024 Celebration: Republic Day celebrations in capital Delhi.. Impressive celebrations..!

75వ భారత గణతంత్ర వేడుకలు(Republic Day 2024 Celebration) ఢిల్లీలో ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌(Karthavya Path)లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), ఇతర ప్రముఖులు, ప్రజలు ఈ వేడుకలో భాగమయ్యారు. ఈ వేడుకకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Republic Day 2024 Celebration: Republic Day celebrations in capital Delhi.. Impressive celebrations..!

దేశ సైనిక సామర్థ్యాన్ని చాటేలా ప్రదర్శన సాగింది. సైనికుల కవాతు ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నారీశక్తి, ఆత్మనిర్భరత థీమ్తో నేవీ శకటం ప్రదర్శించింది. వాయుసేనకు చెందిన నాలుగు ఎంఐ17IV హెలికాప్టర్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. కర్తవ్యపథ్‌పై ఎగురుతూ ‘ధ్వజ్’ ఆకారంలో ఎగురుతూ విన్యాసాలు చేశాయి.

వేడుకల్లో భాగంగా 1,500 మంది మహిళలు వందే భారతం నృత్య ప్రదర్శన నిర్వహించారు. అన్ని రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శన సాగింది. 1500 డ్యాన్సర్లు కలిసి 30 రకాల జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అదేవిధంగా పలు శకటాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. ‘సక్షమ్, సశక్త్, ఆత్మనిర్భర్’ ఇతివృత్తంతో భారతీయ వాయుసేన శకటం ఆకట్టుకుంది.

జీ20 ఇతివృత్తంతో విదేశాంగ శాఖ శకటం, జీ20 కూటమి లోగో, సభ్య దేశాల జెండాలతో కూడిన శకటం, దేశ సంస్కృతికి అద్దం పట్టేలా ఉన్న కేంద్ర హోంశాఖ శకటం అబ్బురపరిచాయి. అదేవిధంగా చంద్రయాన్-3 విజయం ఇతివృత్తంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శకటాన్ని ప్రదర్శించింది. కేంద్ర ఎన్నికల సంఘం శకటాన్ని ప్రదర్శించింది.

అయోధ్య రామాలయ ప్రత్యేకతను తలపించేలా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రదర్శించిన శకటం ఆకట్టుకుంది. బాల రాముడి ప్రతిమతో పాటు శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి సంబంధించిన నమూనాలతో యూపీ శకటం ప్రత్యేకంగా నిలిచింది. ఆదర్శ మహిళల ఇతివృత్తంతో మధ్యప్రదేశ్ శకటం, మహిళా హస్తకళా వృత్తులకు గుర్తుగా రాజస్థాన్ శకటం, మహిళా సాధికారత ప్రోత్సహించేలా ఒడిశా శకటాలు పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

You may also like

Leave a Comment