పార్ల మెంట్ ఎన్నికల (Parliament Elections) ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారేలా ఉన్నాయని భావిస్తున్నారు.. ఇప్పటికే ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా ఉత్తదే అని అంటున్నారు. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ఎల్పీ విలీనం పూర్తి చేసి.. కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతీయాలని ప్లాన్ వేసినట్లు ప్రచారం జరిగింది. కానీ నలుగురు మాత్రమే కాంగ్రెస్ (Congress)లో చేరారు..
వారిలో తెల్లం వెంకట్రావు , దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే ఉన్నారు. అలాగే ప్రకాష్ గౌడ్.. రెండు మూడు రోజుల్లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి గమనిస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే తర్వాత రాజకీయం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు మహబూబా బాద్ జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్ పై ఫైర్ అయ్యారు..
దిగిపో దిగిపో అంటున్నావ్… ఉత్తగ వచ్చామా బిడ్డా అంటూ మండిపడ్డ సీఎం.. మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని గట్టిగా చెప్పారు.. అలాగే ఆగష్టు 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని.. 500 వందల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు.. మానుకోట కాంగ్రెస్ కంచుకోట అని తెలిపిన ఆయన.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహబూబాబాద్ ప్రాంతం విధ్వంసమైందని ఆరోపించారు..
మోడీ, ఫామ్ హౌస్ కేడీ ఇద్దరు కలిసి తెలంగాణను దోపిడీ చేశారని ద్వజమెత్తిన రేవంత్.. కేంద్రం తెచ్చిన చట్టాలకు హత్య ప్రభుత్వం మద్దతు తెలిందన్నారు. తండ్రి రెడ్యానాయక్ ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపండని ఓటర్లకు పిలుపునిచ్చారు.. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని పక్కకు పెట్టారు.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ మంజూరు చేస్తే… ప్రధాని లాథూర్ కు తరలించుకుపోయారని ఆరోపించారు.
ములుగు గిరిజన యూనివర్సిటీని సోనియా గాంధీ మంజూరు చేశారని తెలిపిన సీఎం.. ఈ ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీకి లేదన్నారు.
ఉత్తర భారత దేశంలోని కుంభమేళాకు వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం… మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు.. మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ కిషన్ రెడ్డి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా ? అని ప్రశ్నించారు..