Telugu News » Revanth Reddy : చెప్పింది చేస్తున్న రేవంత్.. మేడిగడ్డ వ్యవహారంపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ..!!

Revanth Reddy : చెప్పింది చేస్తున్న రేవంత్.. మేడిగడ్డ వ్యవహారంపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ..!!

రాష్ట్రంలో తనదైన మార్క్ ఉండేలా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో మంగళవారం విజిలెన్స్ అధికారులు ఈఎన్సీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు.

by Venu
Medigadda Barrage

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మేడిగడ్డ (Madigadda) వ్యవహారం, మేడిపండులా మారిందని అనుకొంటున్నారు.. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) అవినీతిపై దుమ్మెత్తి పోస్తున్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం.. కాళేశ్వరం దోపిడి.. కేసీఆర్ (KCR)కి, ఏటీఎంలా మారిందనే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మేడిగడ్డ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకొంది.

telangana-ministers-in-medigadda-kaleshwaram-loopholes-to-be-revealed 1

రాష్ట్రంలో తనదైన మార్క్ ఉండేలా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో మంగళవారం విజిలెన్స్ అధికారులు ఈఎన్సీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. అయితే జ్యుడిషియల్ ఎంక్వయిరీ ప్రారంభించడానికి ముందే.. బ్యారేజీ కుంగుబాటుకు కారణాలు, బాధ్యులైన అధికారులను గుర్తించే పనిలో పడ్డారు..

ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనను సీరియస్‌గా తీసుకొన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బీఆర్ఎస్ పునాదులు కదిలించిన కాంగ్రెస్ నేతలు.. అవినీతి బయటకు తీయకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు భావిస్తుందని అనుకొంటున్నారు.

అందుకే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో, ప్రాజెక్ట్ వైఫల్యం వెనుక ఉన్నది ఎవరు అనేదానిపై ఫోకస్ పెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చింది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిందని అంటున్నారు..

You may also like

Leave a Comment