పార్లమెంటు ఎన్నికలు పూర్తి అయ్యేవరకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కీలక నిర్ణయాల్లో సైతం తన మార్క్ చూపిస్తూ.. హస్తాన్ని ఆధీనంలో ఉంచుకొన్న సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పెద్దల మనసులో బలంగా నాటుకుపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో సీఎం తీసుకునే నిర్ణయాల్లో ఎన్ని ఒత్తిడులు ఎదురైన కొంత కాలం వరకు జోక్యం చేసుకోక పోవడమే ఉత్తమం అనే భావనకు పెద్ద లీడర్లు వచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ (Congress)లో లేకుంటే తెలంగాణ (Telangana)లో ఆ పార్టీ పరిస్థితి ఇప్పటికి ఏటికి ఎదురు ఈదుతున్న నావలా ఉండేదని.. కేసీఆర్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా పది సంవత్సరాలైన కొలుకోక పోయే వాళ్ళమని అధిష్టానం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే పార్లమెంటు ఎన్నికల వరకు పీసీసీని మార్చేది లేదని ఐఏసీసీ కీలక నేతలు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) అప్పటి వరకు ముఖ్యమంత్రిగాను, పీసీసీ అధ్యక్షుడిగా డబుల్ యాక్షన్ చేయడం తప్పనిసరని అనుకొంటున్నారు. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పీసీసీ (PCC) అధ్యక్షుడిగా ఉన్న నేత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే, వెంటనే పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసేస్తారు. అయితే ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు..
తెలంగాణలో బలంగా నిలదొక్కుకోవాలంటే కొంతకాలం రేవంత్ నే అధ్యక్షుడిగా కూడా కంటిన్యు చేయాలని అధిష్ఠానం డిసైడ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రేవంత్ ప్లేసులో ఇంకెవరున్నా పార్టీకి ఊపొచ్చేది కాదు అధికారంలోకి వచ్చేది కాదన్న గట్టి నమ్మకం కాంగ్రెస్ అధిష్టానంలో బలంగా నాటుకుపోవడం వల్ల . ఎవరు రేవంత్ ను డిస్ట్రబ్ చేసేందుకు లేదని సూచించిందని అనుకొంటున్నారు..
మరోవైపు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే.. అతను ఒక జాబితా ఇచ్చి, రేవంత్ మరొకరిని ప్రతిపాదించిన పక్షంలో నానా గొడవలవుతాయని అధిష్టానం ఆలోచించిందట. అందుకనే పార్లమెంటు ఎన్నికలు అయ్యేవరకు రేవంతే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యు అయితే ఎలాంటి సమస్యలు ఉండవనే భావనలో ఉన్నారని పార్టీవర్గాల నుంచి సవమాచారం..