అనంతపురం(Ananthapuram) జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. అనంతపురం గ్రామీణ మండలం చెన్నంపల్లి దగ్గర ఆగి ఉన్న లారీని మరో ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, పలు ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ లారీలు భారీ వాహనాలను నిలిపారు. ఈ నేపథ్యంలోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.
అయితే, ప్రమాదాలు అరికట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు లారీ డ్రైవర్లు ఓవర్ డ్యూటీలు చేయడం వల్ల నిద్రలేమితో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతోనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.
అధికారులు ఎప్పటికప్పుడు రోడ్డుపై ఎక్కబడితే అక్కడ వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇటీవల కాలంలో మద్యం మత్తులో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అదేవిధంగా డ్రైవర్లు ఓవర్ డ్యూటీల కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కోలుకుని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.