Telugu News » Road Accidents : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. ఒకరు మృతి పదిమందికి గాయాలు..!!

Road Accidents : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. ఒకరు మృతి పదిమందికి గాయాలు..!!

ప్రమాదంలో బైక్ నడుపుతున్న దంతాలపల్లికి చెందిన తూర్పాటి గణేష్ తండ్రి ఉప్పలయ్య (23) స్పాట్‌లోనే మృతి చెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న మరో ముగ్గురు పెండెం శ్రీను, దానబోయిన సమ్మయ్య, రోహిత్, కారు డ్రైవర్ చిన్న పాక చందుకు గాయాలయ్యాయి.

by Venu
road accident

సూర్యాపేట (Suryapet) జిల్లా, నూతనకల్ (Nutankal) మండలం గుండ్ల సింగారం (Gundla Singaram) స్టేజి వద్ద మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TS 05 UC 0261 నెంబరు‌ కారు తొర్రూరు నుంచి సూర్యాపేటకు వెళ్తుంది. ఈ క్రమంలో కారు గుండ్ల సింగారం HP పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న TS 26 G 4226 నెంబర్‌ పల్సర్ బైక్ ఢీకొన్నాయి.

Road Accident: A van collided with a stationary lorry.. Three died..!

ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న దంతాలపల్లికి చెందిన తూర్పాటి గణేష్ తండ్రి ఉప్పలయ్య (23) స్పాట్‌లోనే మృతి చెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న మరో ముగ్గురు పెండెం శ్రీను, దానబోయిన సమ్మయ్య, రోహిత్, కారు డ్రైవర్ చిన్న పాక చందుకు గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కాగా బైకుపై ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్రాంతి సంబరాలు ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ముందు వెళుతున్న మరో కారును వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ముందు వెళ్తున్న కారు పల్టీలు కొట్టింది. కారు వెనక భాగం నుజ్జు నుజ్జు అయింది. సూర్యాపేట జిల్లా జాతీయ రహదారి 65 విజయవాడ- హైదరాబాద్ మునగాల మండల కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. సమచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

You may also like

Leave a Comment