Telugu News » Rahul Gandhi : తెలంగాణలో రాచరిక పాలన ఏర్పడింది.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు..!!

Rahul Gandhi : తెలంగాణలో రాచరిక పాలన ఏర్పడింది.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు..!!

రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బంధీ అయిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకొని జేబులు నింపుకుంటున్నారుని కేసీఆర్ (KCR)ఫ్యామిలీపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

by Venu
jagityal ragul sabha

తెలంగాణ (Telangana)ఎన్నికల పర్యటనలో భాగంగా జగిత్యాల (Jagityala) జిల్లాలో శుక్రవారం రాహుల్ గాంధీ (Rahul Gandhi) రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఇంత ఎండలో మీటింగ్‌కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెబుతూనే.. ఈ ఎన్నిక నియంత్రత్వ దొరల పాలనకు, ప్రజలకు మధ్య జరుగుతుందని అన్నారు. ప్రజల పోరాటం వల్ల వచ్చిన తెలంగాణలో రాచరిక పాలన ఏర్పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు..

రాష్ట్రంలో అన్ని రేట్లతో పాటు పలురకాల దందాలు, మాఫియా గ్యాంగ్ లు కూడా పెరిగాయని రాహుల్ ఆరోపించారు. రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బంధీ అయిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకొని జేబులు నింపుకుంటున్నారుని కేసీఆర్ (KCR)ఫ్యామిలీపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజాం చెక్కర ఫ్యాక్టరీ ప్రభుత్వం ముసివేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

పసుపు మద్దతు ధరను పెంచుతామని రాహుల్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఓబీసీ గణన దేశవ్యాప్తంగా చేస్తామన్నారు. దేశంలో ఉన్న డబ్బు అదానీ చేతుల్లోకి పోయేలా మోడీ, కేసీఆర్ పనిచేస్తున్నారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులంటారు.. ఎదురు తిరిగితే జైలుకు పంపుతారు. ఇదా ప్రజలు కోరుకొన్న తెలంగాణ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటూ ఢిల్లీలో బీజేపీని, ఇక్కడ బీఆర్‌ఎస్‌ను ఓడించాలని రాహుల్‌ పిలుపునిచ్చారు.

ఢిల్లీలో మీకోసం పోరాడడానికి నేను సైనికునిలా ఉన్నానని రాహుల్ గాంధీ అన్నారు. సమస్యలపై పోరాటం చేస్తే లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. ఉంటున్న ఇల్లు తీసుకున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మీ ఇల్లు అవసరం లేదు తీసుకోండి.. దేశమంతా నా ఇల్లే అని చెప్పినట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు ఈ రోజుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ విజయభేరీ యాత్ర ముగిసింది.

You may also like

Leave a Comment