ప్రతీ భారతీయుడు ప్రపంచ వ్యవహారాల అర్థం చేసుకోవాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(External Affairs Minister S Jaishankar) అన్నారు. శనివారం ఢిల్లీ(Delhi)లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానంపై మరింత ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందన్నారు.
విదేశాంగ విధానం చాలా క్లిష్టంగా ఉందన్నారు. ప్రపంచంలో ఏదైనా జరిగినప్పుడు అది కచ్చితంగా అందరి జీవితంపై ప్రభావం చూపుతుందన్నారు. దీనికి ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్ మహమ్మారి నిదర్శనమని గుర్తుచేశారు. భారతీయులందరూ దానిని కొంతమంది వ్యక్తులకు వదిలేయొద్దన్నారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ శక్తి మరింత పెరిగిందని జైశంకర్ పునరుద్ఘాటించారు. ప్రపంచ విపత్తు, సంక్షోభ సమయాల్లో యావత్ ప్రపంచానికి సాయం చేయడానికి భారత్ ముందుకొచ్చిందన్నారు. 100 కంటే ఎక్కువ దేశాలకు వ్యాక్సిన్లను అందించిందన్నారు.
కొవిడ్ -19తో భారత్ ఎక్కువగా ప్రభావితమవుతుందని అన్ని దేశాలు భావించాయన్నారు. ఇక్కడ అత్యధిక జనాభా, మాస్కులు, వైద్యుల కొరత ఉన్నప్పటికీ ప్రధాని మోడీ వాటన్నింటినీ అధిగమించడంతో పాటు ప్రపంచానికి సాయమందించగలిగారని గుర్తుచేశారు.