Telugu News » Chandra Babu: ‘సాక్షి’ వీడియో, ఫోటోగ్రాఫర్లను సీఐడీ ఎలా అనుమతించింది?: పట్టాభి

Chandra Babu: ‘సాక్షి’ వీడియో, ఫోటోగ్రాఫర్లను సీఐడీ ఎలా అనుమతించింది?: పట్టాభి

సీఐడీ విచారణ జరుగుతూంటే ఇలా ఒక మీడియాకు చెందిన ప్రతినిధులను ఎలా అనుమతించారంటూ ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

by Prasanna
TDP Pattabi

టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ (CID) అధికారులు విచారిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలలో ఒక వీడియో గ్రాఫర్, ఫోటో గ్రాఫర్ కూడా ఉన్నారు. వారు సాక్షి (Sakshi) మీడియాకు సంబంధించిన వారని టీడీపీ (TDP) పేర్లతో సహా బయటపెట్టింది. సీఐడీ విచారణ జరుగుతూంటే ఇలా ఒక మీడియాకు చెందిన ప్రతినిధులను ఎలా అనుమతించారంటూ ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

TDP Pattabi

ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబును విచారిస్తున్న గదిలోకి సాక్షి ఫొటోగ్రాఫర్ పవన్ ను, కెమెరామన్ సత్యను ఎలా అనుమతించారంటూ ప్రశ్నించారు. వీడియోలు, ఫొటోలు విడుదల చేసి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

తాడేపల్లి ప్యాలెస్ చేతిలో సీఐడీ అధికారులు కీలుబొమ్మలుగా మారిపోయారని, తాడేపల్లి ప్యాలెస్ నేతృత్వంలోనే చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం నడుస్తోందని పట్టాభి ఆరోపించారు.

“చంద్రబాబును అధికారులు ప్రశ్నిస్తుంటే, ఆయన సమాధానాలు చెప్పలేకపోతున్నారని దుష్ప్రచారం చేసేందుకే ఈ ఫొటోలు, వీడియోలు లీక్ చేశారు. మిగతా మీడియా సంస్థల ప్రతినిధులకు లేని అనుమతి, కేవలం సాక్షి మీడియా ప్రతినిధులకు ఎలా వచ్చింది?” అంటూ పట్టాభి నిలదీశారు.

 

You may also like

Leave a Comment