Telugu News » Salaar Tickets: ప్రభాసా.. మజాకా.. దెబ్బకు బుక్‌ మై షో సర్వర్లు క్రాష్..!

Salaar Tickets: ప్రభాసా.. మజాకా.. దెబ్బకు బుక్‌ మై షో సర్వర్లు క్రాష్..!

సలార్(Salar) మూవీ టికెట్లను తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ మంగళవారం రాత్రి విడుదల చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా బుక్‌మై షో(Book my show) సర్వర్లు క్రాష్ అయ్యాయి.

by Mano
Salaar Tickets: Prabhasa.. Majaka.. Dabaku Book My Show Servers Crashed..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటించిన సలార్(Salar) మూవీ టికెట్లను తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ మంగళవారం రాత్రి విడుదల చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా బుక్‌మై షో(Book my show) సర్వర్లు క్రాష్ అయ్యాయి. కాసేపు యాప్ పనిచేయడం మానేసింది.

Salaar Tickets: Prabhasa.. Majaka.. Dabaku Book My Show Servers Crashed..!

కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మూవీ సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశాయి. మంగళవారం రాత్రి 8.24 గంటలకు ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నారు. అయితే తెలంగాణ, ఏపీ థియేటర్లలో టికెట్స్ ఓపెన్ చేయడంతోనే లక్షల మంది ఒకేసారి యాప్‌ను ఓపెన్ చేశారు. దీంతో యాప్ కాసేపు పని చేయలేదు. క్రాష్ అయిపోయింది.

బుక్‌మై షో ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో ఫ్యాన్స్‌ స్కీన్ షాట్‌లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఆ లిస్టులో బాహుబలి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ కూడా చేరారు. సలార్ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారనేది స్పష్టమవుతోంది. అయితే, కాసేపు బ్రేక్ ఇచ్చిన బుక్ మై షో, ఆ తర్వాత అన్ని థియేటర్ల టికెట్స్ ఒకేసారి అప్‌లోడ్ చేయకుండా నెమ్మదిగా ఒక్కో థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేయడం మొదలుపెట్టింది.

మరోవైపు, నైజాంలో మైత్రీ మూవీ సంస్థ కేవలం మల్టీప్లెక్స్ టికెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పెట్టింది. సింగిల్ స్క్రీన్‌ టికెట్లను కౌంటర్ల వద్ద అమ్మకాలు ప్రారంభించింది. దీంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. కొందరు ఫ్యాన్స్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మైత్రీ సంస్థపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడ్డారు.

You may also like

Leave a Comment