బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ (Salman Khan) బాంద్రా నివాసం వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 5గంటలకు బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ వద్దకు బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కాల్పుల(Gun Fire) అనంతరం ముంబై నుంచి పరారైన వారు గుజరాత్‌లోని భుజ్‌లో చిక్కినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను ముంబైకి తీసుకొచ్చి విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నవీ ముంబై పన్వెల్‌లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెలరోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు సోమవారం ఓ అధికారి వెల్లడించిన విషయం తెలిసిందే.
సల్మాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్ ఉంది. మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను విచారించారు. నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన బైక్ పాత యజమాని, బైక్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిని సైతం ప్రశ్నించారు. బైక్ పాత యజమానిది కూడా పన్వెల్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గతేడాది మార్చిలో గతేడాది ఏప్రిల్ 11న సల్మాన్‌కు చంపుతామంటూ ఆయన ఆఫీసుకు ఈ-మెయిల్స్ అందిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపి గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. యూకేలో ఉంటున్న భారతీయ యువకుడు ఆ పని చేసినట్లు గుర్తించారు. అప్పటి నుంచి సల్మాన్ ఇంటి వద్ద వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. తాజాగా సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరగడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.