Telugu News » Viral Message : కేసీఆర్ కు సూటి ప్రశ్నలు..!

Viral Message : కేసీఆర్ కు సూటి ప్రశ్నలు..!

పీఆర్సీ వాయిదా పద్దతిలో చెల్లించే ఏకైక రాష్ట్రం తెలంగాణే

by admin
CM KCR

అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై భిన్న వాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే.. సీఎంపై సెటైర్లు పేలుతున్నాయి. ఉద్యోగులకు సంబంధించి ఓ మెసేజ్ బాగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న మెసేజ్

1. పీఆర్సీ వాయిదా పద్దతిలో చెల్లించే ఏకైక రాష్ట్రం తెలంగాణే
2. డీఏలను కూడా వాయిదా పద్దతులలో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే
3. సరెండర్ బిల్స్ సబ్మిట్ చేసిన 10 నెలలు అయిన బిల్ పాస్ కానీ ఏకైక రాష్ట్రం తెలంగాణే
4. ఉద్యోగి చచ్చిపోతేనే లేదంటే రిటైర్మెంట్ అయితేనే పాత పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాం అంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే
5. కొత్త పీఆర్సీ సమయం అయిన పాత పీఆర్సీ బకాయిలు చెల్లించని ఏకైక రాష్ట్రం తెలంగాణే
6. 10 సంవత్సరాలు దాటినా ప్రమోషన్ ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణే
7. సకాలంలో ట్రాన్స్ ఫర్స్ చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణే
8. రిటైర్మెంట్ అయిన తర్వాత మన కులపోడే అని స్పెషల్ జీవోలు ఇచ్చి 2, 3 సంవత్సరాలు పదవీ కాలాన్ని పొడిగించిన రాష్ట్రం తెలంగాణే
9. దేశంలోనే ఒకప్పుడు ధనిక రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల కుప్పగా తయారైంది మన రాష్ట్రమే
10. ఒకటవ తారీఖున వచ్చే జీతాలు 10, 15 తారీఖుల్లో రాష్ట్రం అంతటా ఒకే రోజు ఎప్పుడు పడతాయో తెలియని రాష్ట్రం తెలంగాణే
11. ఎక్కువ జీతాలు కలిగిన సీఎం, మంత్రులు తెలంగాణలోనే
12. దేశంలో అడ్డగోలుగా ఉచిత పథకాలు పెట్టిన రాష్ట్రం తెలంగాణే
13. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి పదవులు ఉన్న రాష్ట్రం తెలంగాణే

ఇలా అనేక ప్రశ్నలతో ఉన్న ఈ మెసేజ్ వాట్సాప్, ఫేస్ బుక్ లో వైరల్ అవుతోంది. కేసీఆర్ స్పీచ్ కు సెటైరికల్ గా దీనిని ఫార్వార్డ్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment