Telugu News » Saudi Arabia: శత్రుదేశంపై సౌదీ రాజు దాతృత్వం.. వేలాది మందికి సాయం..!

Saudi Arabia: శత్రుదేశంపై సౌదీ రాజు దాతృత్వం.. వేలాది మందికి సాయం..!

పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు జకాత్ అల్-ఫితర్‌ను ఉపసంహరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సౌదీ రాజు సల్మాన్ యెమెన్‌కు జకాత్ అల్-ఫితర్ అందించడానికి పౌర సమాజ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

by Mano
Saudi Arabia: The generosity of the Saudi King against the enemy country.. Helped thousands of people..!

శత్రుదేశమైన యెమెన్‌(Yemen)పై సౌదీ అరేబియా రాజు సల్మాన్(Saudi Arabia King Salman) దాతృత్వాన్ని చాటుకున్నారు. పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు జకాత్ అల్-ఫితర్‌ను ఉపసంహరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సౌదీ రాజు సల్మాన్ యెమెన్‌కు జకాత్ అల్-ఫితర్ అందించడానికి పౌర సమాజ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Saudi Arabia: The generosity of the Saudi King against the enemy country.. Helped thousands of people..!

సౌదీ అరేబియా కేఎస్ రిలీఫ్ కింద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అనేక దేశాలకు సాయం చేస్తోంది. తాజా ఒప్పందంతో యెమెన్‌లోని 31,333 పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ యుద్ధం కారణంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమెన్‌ ప్రజలకు ఈద్‌కు ముందు సాయాన్ని అందించడం సౌదీ కింగ్ ఒప్పంద ఉద్దేశం.

మరోవైపు సీబ్రిడ్జ్ ద్వారా సుడాన్‌ దేశానికి తన ఏడవ సాయాన్ని పంపింది సౌదీ. సౌదీ అరేబియా, సుడాన్ ఇప్పటికే బలమైన సంబంధాలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. షిప్‌మెంట్ లో 12 రిఫ్రిజిరేటర్ ట్రక్కులు 14,960 ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. ఈ జెడ్డానౌక ఇస్లామిక్ పోర్ట్ నుంచి బయల్దేరి గురువారం సూడాన్‌లోని సువాకిన్ పోర్టు చేరుకుంది. ఈ సాయం సౌదీ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడుతున్న సూడాన్‌లో రెండవ దశ ఆహార భద్రత ప్రాజెక్ట్ భాగం.

సూడాన్‌లో కొనసాగుతున్న సౌదీ రిలీఫ్ మిషన్ నుంచి దాదాపు 1.5 మిలియన్ల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. మరోవైపు ఏజెన్సీ మలేషియాకు 25 టన్నుల ఖర్జూరాన్ని బహుమతిగా ఇచ్చింది. పలువురు మలేషియా అధికారుల సమక్షంలో మలేషియాలోని సౌదీ రాయబారి ముసైద్ బిన్ ఇబ్రహీం అల్-సలీమ్ ఏజెన్సీ తరపున బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా, మలేషియా మధ్య బలమైన సంబంధాలను అల్ సలీం కొనియాడారు.

You may also like

Leave a Comment