Telugu News » KTR : కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రేవంత్ కాలి గోటికి కూడా సరిపోరు….!

KTR : కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రేవంత్ కాలి గోటికి కూడా సరిపోరు….!

మైనార్టీలపై కేటీఆర్ దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు.

by Ramu
shabbir alis sensational fire on ktr

మాజీ మంత్రి కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మైనార్టీలపై కేటీఆర్ దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తనను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ప్రభుత్వ సలహదారుగా నియమించిందని గుర్తు చేశారు.

shabbir alis sensational fire on ktr

ఓటమి పాలైన తెల్లారి నుంచే బయటకి వచ్చి ఓటమిని జీర్ణించుకోలేక కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. విలువల్లేని మనుషులు కేసీఆర్ కుటుంబ సభ్యులు అంటూ నిప్పులు చెరిగారు. గతంలో ప్రభుత్వాన్ని కేటీఆర్ తన సొంత ఆస్తి లాగా వాడుకున్నాడని ఆరోపించారు. రెడీగా ఉన్న పార్టీలో చేరి.. తండ్రి పేరు చెప్పుకుని కేటీఆర్ పదవులు అనుభవించారని మండిపడ్డారు.

ఇప్పుడు త్యాగాలు చేసి అలిసిపోయినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అమరవీరుల రక్తం తాగి వేలాది కొట్లు సంపాదించుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను కొట్టడం కోసం ఎంతో మంది నాయకులు ప్రయత్నాలు చేశారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా సులువుగా కేసీఆర్‌ను గద్దే దించేసాడన్నారు. సిగ్గు శరం వదిలి ప్రజలను కేసీఆర్ దోచుకున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందుకే ఇప్పుడు బయటకు వచ్చేందుకు జంకుతున్నాడని ఎద్దేవా చేశారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది మైనార్టీలు ఓడిపోయారన్నారు. అంతమాత్రాన వివక్ష చూపినట్లు కాదని వెల్లడించారు. ఎప్పటికైనా మైనార్టీలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. భవిష్యత్‌లో మైనార్టీలకు కాంగ్రెస్ మరిన్ని అవకాశాలు ఇస్తుందని స్పష్టం చేశారు. అసలు కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 50 రోజుల రేవంత్ రెడ్డి పాలన చూసి.. పార్టీలో చేరడానికి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని వివరించారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించిన ప్రజలకు కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు చెప్పారు. కేటీఆర్ తల దించుకోవాలన్నారు.

కేటీఆర్ దగ్గర ఎవరూ మిగలరని చెప్పారు. బీఆర్ఎస్‌లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రేవంత్ కాలి గోటికి కూడా సరిపోరని ఎద్దేవా చేశారు. ఏ కారణం వల్ల ఓడిపోయారో చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉందా? అని సవాల్ విసిరారు. సోనియా ఇచ్చిన తెలంగాణని తానే తెచ్చానని కేసీఆర్ డబ్బా కొట్టుకున్నాడని నిప్పులు చెరిగారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదన్నారు.

 

You may also like

Leave a Comment