Telugu News » సానియాను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని షారుఖ్ అడిగిన ప్రశ్నకు షోయబ్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా?

సానియాను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్? అని షారుఖ్ అడిగిన ప్రశ్నకు షోయబ్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా?

సానియాతో పెళ్లి గురించి షారుఖ్ అడిగిన ప్రశ్నకి షోయబ్ ఏమని సమాధానం ఇచ్చారంటే?

by Sri Lakshmi

ప్రస్తుతం ఎక్కడ చూసిన షోయబ్ మాలిక్ వివాహం గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఈ పాకిస్థానీ క్రికెటర్ తాజాగా మూడవసారి వివాహం చేసుకున్నాడు. ఈసారి అతను పాకిస్తానీ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నారు. అయితే సోషల్ మీడియా హ్యాండిల్స్ తన పెళ్లి తాలూకు ఫోటోలను పంచుకోవడంతో ఒక్కసారిగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో సానియా గురించిన చర్చ కూడా ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో సానియా ఫామిలీ కూడా వారిద్దరూ విడాకులు తీసుకున్నారని, సానియాకు ప్రైవసీ ఇవ్వాల్సింది కోరిన సంగతి విదితమే.

ఇది ఇలా ఉంటె మరో వైపు గతంలో సానియాకు, షోయబ్ కు మధ్య ఉన్న మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సారి సానియా, షోయబ్ లు షారుఖ్ ఖాన్ తో ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో షారుఖ్ ఖాన్ సానియాను.. షోయబ్ ను వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ ప్రశ్నించారు. దానికి సమాధానంగా సానియా నేను అతనిని ఎక్కువగా చూడలేదు. కానీ, షోయబ్ చాలా షై పర్సన్. ఎంతలా అంటే.. అతనికి ఎలా మాట్లాడాలి అనేది కూడా మీరే నేర్పాలి అంటూ సరదాగా కామెంట్ చేసింది.

ఇదే ప్రశ్నను షారుక్ షోయబ్ ని కూడా అడిగాడు. దానికి షోయబ్ నేను అసలు అంత వరకు ఆలోచించలేదని.. ఆలోచించే లోపులే మా వివాహం అయిపొయింది అని చెప్పుకొచ్చాడు. దానికి షారుఖ్ సరదాగా కౌంటర్ వేశారు. మీరు ఇండియాలో ఉన్నారు. కాబట్టి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్పాడు.

You may also like

Leave a Comment