Telugu News » Shirdi : అయోధ్య రాములోరి ఆహ్వానం అందుకొన్న షిర్డీ సాయినాథ్..!!

Shirdi : అయోధ్య రాములోరి ఆహ్వానం అందుకొన్న షిర్డీ సాయినాథ్..!!

చరిత్రాత్మక వేడుకకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విశిష్ట అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నాయి. పత్రికలపై ఉన్న అక్షరాలను దేవనగరి (Devanagari) లిపిలో రాశారు.

by Venu
ayodhya ram mandir statue selection ram lalla statue selected ahead of mega ram temple Launch

అయోధ్య రామమందిర (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22న ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే.. కాగా ప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆహ్వాన పత్రాల పంపిణీ ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో పాల్గొనడానికి జనవరి 22న అయోధ్యకు రావాలంటూ షిర్డీ సాయినాథుడి (Shirdi Sainath)కి ఆహ్వానం అందింది.

ayodhya ram mandir statue selection ram lalla statue selected ahead of mega ram temple Launch

ఇన్విటేషన్ అందినట్లు షిర్డీ దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరపున ప్రణవ్ పవార్ షిర్డీ ఆలయాన్ని సందర్శించారు. ఆహ్వాన పత్రికను సాయిబాబా (Saibaba) సమాధిపై ఉంచారు. అనంతరం షిర్డీ దేవస్థానం సీఈఓ (CEO) తుకారాం ముండేకు అందజేశారు. అయితే.. ఆలయం తరఫున ఎవరు రామయ్య కార్యక్రమానికి వెళ్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

కాగా.. చరిత్రాత్మక వేడుకకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విశిష్ట అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నాయి. పత్రికలపై ఉన్న అక్షరాలను దేవనగరి (Devanagari) లిపిలో రాశారు. మొదటి పేజీలో అపూర్వ ఆనందిక్‌ నిమంత్రన్‌.. అంటే తెలుగులో అపూర్వమైన సంతోషకరమైన ఆహ్వానం అని రాసి ఉంది. ఆ వాక్యానికి పైభాగాన మందిర చిత్రాన్ని ముద్రించారు.

ఆహ్వాన పత్రికను తెరవగానే రెండో పేజీలో అందమైన బాలరాముడి మనోహరమైన రూపాన్ని చిత్రీకరించారు. మరోవైపు ఆహ్వాన పత్రికలో.. ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆనందీ బెన్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ మొదలగువారి పేర్లు కనిపిస్తాయి. జనవరి 22 న ఉదయం పూజ, మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉంది.

You may also like

Leave a Comment