కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు కరువు సాయంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కర్ణాటక ముఖ్యమంత్రి(Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) అన్నారు. రాయచూరు(Rayachuru)లోని సింధనూరు(Sindhanuru)లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య ప్రసంగిస్తూ కీలక ఆరోపణలు చేశారు.
కరువు సాయం కోసం కేంద్రానికి ఎందుకు సాయం చేయలేదో ప్రజలు తమ ఎంపీలను అడగాలని సిద్ధరామయ్య కోరారు. కన్నడ ప్రజలు కేంద్రానికి ఏటా రూ.4లక్షల కోట్ల పన్ను చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చేది కేవలం రూ.52వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. కరువు సమయంలోనూ కేంద్రం కర్ణాటకకు ఏమీ ఇవ్వలేదంటూ ఆరోపించారు.
నెవిల్ బ్యాలెన్సింగ్ డ్యామ్ నిర్మాణానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ట్రంలో గత బీజేపీ ప్రభుత్వం సాగునీటి పేరుతో డబ్బును దుర్వినియోగం చేసిందంటూ ఆరోపించారు. సింధనూరులో ఇప్పటి వరకు 80 శాతం సాగునీరు అందిందని తెలిపారు. 100 శాతం సాగునీటి సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఐదు హామీలనూ అమలు చేశామనే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 195 తాలూకాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో రైతులు కరువుతో రూ.30వేల కోట్లకు పైగా నష్టపోయారని, కేంద్ర ప్రభుత్వం రూ.4860కోట్లు ఇవ్వాలని డిమాండ్
చేశారు.