Telugu News » TSRTC : మహిళల ఫ్రీ జర్నీ ఎఫెక్ట్‌.. ఇకపై ఆ రెండు టికెట్లు రద్దు..!!

TSRTC : మహిళల ఫ్రీ జర్నీ ఎఫెక్ట్‌.. ఇకపై ఆ రెండు టికెట్లు రద్దు..!!

మహాలక్ష్మి స్కీం వల్ల ప్రయాణీకుల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోందని అధికారులు భావించినట్టు తెలుస్తోంది. అదీగాక సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరగడం వల్ల ప్రయాణికులకు ఆసౌకర్యం కలుగుతోందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం..

by Venu
problems in free bus travel complain to these numbers sajjanar

రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్‌ (Mahalakshmi Scheme)ఎఫెక్ట్ వల్ల ఫ్యామిలీ-24, టి-6 టికెట్లపై కత్తెరపడింది. ఇప్పటికే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని తెలంగాణ (Telangana) మహిళలు వంద శాతం ఉపయోగించుకొంటున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియా 100 శాతం నమోదు అవుతోందని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో టీఎస్‌ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

problems in free bus travel complain to these numbers sajjanar

గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) వెల్లడించారు. జనవరి 1వ తేదీ నుండి ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా సజ్జనార్ ఈ విషయాన్ని తెలిపారు. బస్సుల్లో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది.

అయితే మహాలక్ష్మి స్కీం వల్ల ప్రయాణీకుల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోందని అధికారులు భావించినట్టు తెలుస్తోంది. అదీగాక సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరగడం వల్ల ప్రయాణికులకు ఆసౌకర్యం కలుగుతోందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.. మరోవైపు ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీ రేపటి నుంచి ఆపివేస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు.

You may also like

Leave a Comment