Telugu News » Singareni : సింగరేణి సీఎండీ శ్రీధర్‌ బ‌దిలీ.. కొత్త డైరెక్టర్‌ ఎవరంటే..?

Singareni : సింగరేణి సీఎండీ శ్రీధర్‌ బ‌దిలీ.. కొత్త డైరెక్టర్‌ ఎవరంటే..?

గతంలో సింగరేణి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో.. శ్రీధర్ ఎక్స్ టెన్షన్ కోసం పెట్టిన రిజల్యూషన్ ను.. సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేద‌ని తేల్చేశారు. అయినప్పటి రాష్ట్ర సర్కార్ సాయంతో ఆర్డినరీ రిజల్యూషన్ పాస్‌ చేయించుకొని శ్రీధర్ ఇప్పటి వరకు పదవిలో కొనసాగుతున్నారు. ఈమేరకు తొమ్మిదేండ్లుగా సింగరేణి సీఎండీ పోస్టులో ఉన్న శ్రీధర్ సంస్థలో ఎన్ని అవ‌క‌త‌క‌లు జ‌రిగినా ప‌ట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి..

by Venu

తొమ్మిదేండ్లుగా సింగరేణి (Singareni) సీఎండీ (CMD)గా ఉంటున్న ఎన్‌. శ్రీధర్‌ (Sridhar) పదవీకాలం ముగిసింది. దీంతో ఆయ‌న‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయ‌న స్థానంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్. బల్ రాంకు సీఎండీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు శ్రీ‌ధ‌ర్ 2015 జనవరి 1వ తేదీ నుంచి పదవిలో ఉన్నారు.

వాస్తవానికి శ్రీధర్ పదవీకాలం 2016 డిసెంబర్ 31లో ముగిసింది. కానీ కేసీఆర్ (KCR)కి విధేయుడిగా ఉన్నట్టు ఆరోపణలున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ (BRS) సర్కార్.. ఒకసారి రెండేళ్లు, రెండుసార్లు ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అయితే ఐదేళ్లకు మించి ఈ పదవిలో కొనసాగరాదని రూల్స్ చెబుతోన్నాయి. కానీ శ్రీధర్ సీఎండీ పదవిలో తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్నారు. దీనికి కారణం కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చెబితే.. అదే చేయడం శ్రీ‌ధ‌ర్ కర్తవ్యంగా భావించడమే అనే విమర్శలు ఉన్నాయి..

మరోవైపు జనవరి 2021లో సింగరేణి సీఎండీగా శ్రీధర్‌ను కొన‌సాగించేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం అభ్యంత‌రాలు వ్యక్తం చేసింది. కానీ కేంద్రం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, సీఎండీ నియామకం విషయంలో పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండటం వల్ల గట్టిగా చర్యలు చేపట్టలేక పోయింది. దీంతో ఇప్పటి వరకు శ్రీధర్‌ సంస్థలో కొన‌సాగారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న బ‌దిలీ త‌ప్పలేదు.

అయితే గతంలో సింగరేణి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో.. శ్రీధర్ ఎక్స్ టెన్షన్ కోసం పెట్టిన రిజల్యూషన్ ను.. సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేద‌ని తేల్చేశారు. అయినప్పటి రాష్ట్ర సర్కార్ సాయంతో ఆర్డినరీ రిజల్యూషన్ పాస్‌ చేయించుకొని శ్రీధర్ ఇప్పటి వరకు పదవిలో కొనసాగుతున్నారు. ఈమేరకు తొమ్మిదేండ్లుగా సింగరేణి సీఎండీ పోస్టులో ఉన్న శ్రీధర్ సంస్థలో ఎన్ని అవ‌క‌త‌క‌లు జ‌రిగినా ప‌ట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి..

You may also like

Leave a Comment