Telugu News » Sircilla : ప్రజలకు కేసీఆర్ అరుంధతి నక్షత్రం చూపించారు.. పొన్నం కీలక వ్యాఖ్యలు..!

Sircilla : ప్రజలకు కేసీఆర్ అరుంధతి నక్షత్రం చూపించారు.. పొన్నం కీలక వ్యాఖ్యలు..!

ఎంపీగా ఉన్న సంజయ్.. పార్లమెంట్ నుంచి ఏమి తీసుకువచ్చావు ప్రజలకు తెలుపాలని కోరారు.. స్థానికంగా ఉన్న మంత్రి కాంగ్రెస్ కు చెందిన పద్మశాలి నాయకులను బెదిరించి వాళ్ళ పార్టీ లో చేర్చుకున్నారని ఆరోపించారు.

by Venu
minister ponnam prabhakar comments on husnabad

రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS)పై కీలక వ్యాఖ్యలు చేశారు.. గత పది సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు అధికారంలో వున్నాయి. కానీ శవ రాజకీయాలు చేస్తూ.. పార్టీని ఇబ్బందులకు గురి చెయ్యాలని చూస్తున్నట్లు ఆరోపించారు.

Ponnam Prabhakar: Ready to discuss projects: Minister Ponnam Prabhakarనాడైన, నేడైన నేతన్నల అదుకున్నది కాంగ్రెస్ అని తెలిపారు. ఈ పార్టీ ఎప్పుడు కూడా జీఎస్టీ వేయలేదన్నారు. చేనేత బోర్డ్ ను బీజేపీ కాన్సిల్ చేసిందని గుర్తు చేశారు.. 10 వ తేదీన దీక్ష చేస్తా అంటున్న బండి సంజయ్, నీవు టెక్స్టైల్ పరిశ్రమకు ఎంత తెచ్చావో పత్రిక ప్రకటన విడుదల చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. మెగా టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లకు తీసుకు రావాలని తాము కోరినట్లు తెలిపారు..

ఎంపీగా ఉన్న సంజయ్.. పార్లమెంట్ నుంచి ఏమి తీసుకువచ్చావు ప్రజలకు తెలుపాలని కోరారు.. స్థానికంగా ఉన్న మంత్రి కాంగ్రెస్ కు చెందిన పద్మశాలి నాయకులను బెదిరించి వాళ్ళ పార్టీ లో చేర్చుకున్నారని ఆరోపించారు. గెలిస్తే అన్ని ఇస్తామని నేతన్నలకు కేసీఆర్ అరుంధతి నక్షత్రం చూపించినట్లు చూపించి ఒక్క పని కూడా చేయలేదని పొన్నం మండిపడ్డారు.. నేతన్నలు పని లేదు అని అనకుండా వుండే విధంగా మా ప్రభుత్వం చేస్తుందన్నారు.

అలాగే అన్ని వస్తువులు కొనేటట్లు జీవో సైతం తీసుకొచ్చామని పేర్కొన్నారు. నేతన్నలకు అండగా మేము ఉంటుంటే.. మీరు మాత్రం శవ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.. సిరిసిల్ల నేతన్నలు అధైర్య పడకుండా వుండండి, ఏ సమస్య వున్న మా కాంగ్రెస్ లీడర్ లకు చెప్పండి పరిష్కరిస్తాం అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.. నేతన్న బకాయిల అన్నింటినీ విడుదల చేసే బాధ్యత మాదే ఇప్పుడొక విడత తరువాత ఒక విడత విడుదల చేస్తామని వివరించారు.

You may also like

Leave a Comment