Telugu News » Congress: సోనియాగాంధీ రాక…కాంగ్రెస్ లో కొట్లాటలు

Congress: సోనియాగాంధీ రాక…కాంగ్రెస్ లో కొట్లాటలు

నిన్న ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో కార్యకర్తులు కొట్టుకోగా...హాజరైనా సీనియర్ లీడర్లు మధ్యలోనే వెళ్లిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇవాళ కూడా ఇదే సీన్ కనిపించింది.

by Prasanna
congress fights

తెలంగాణా  రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ (Congree Party) అధినేత సోనియాగాంధీ (Sonia Gandhi) వస్తున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోనియా సభను విజయవంతం చేసేందుకు ఈ సమావేశాల్లో క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే తెలంగాణా (Telangana)లోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో కొట్లాటలు, కుమ్ములాటలే కనిపిస్తూ…కాంగ్రెస్ పార్టీలోని వర్గవిభేధాలను బయటపెడుతున్నాయి.

congress fights

నిన్న ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో కార్యకర్తులు కొట్టుకోగా…హాజరైనా సీనియర్ లీడర్లు మధ్యలోనే వెళ్లిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇవాళ కూడా ఇదే సీన్ కనిపించింది. ఈ సారి మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. డాక్టర్ మురళీ నాయక్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి వర్గాలు సమావేశంలోనే బాహాబాహీకి దిగారు.

మహబూబాబాద్ పట్టణంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే డాక్టర్ మురళీ నాయక్ ను స్టేజ్ పైకి పిలవాలంటూ ఆయన అనుచరులు ఆందోళన చేశారు.

మురళీ నాయక్ ను ఎందుకు స్టేజ్ పైకి ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయులు స్టేజ్ పైకి దూసుకొచ్చారు. మురళీనాయక్ అనుచరులతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి అనుచరులు గొడవకు దిగారు. మాధవరెడ్డికి వ్యతిరేకంగా మురళీ నాయక్ అనుచరులు నినాదాలు చేశారు. దీంతో సమావేశం మధ్యలో నుంచి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మాధవ రెడ్డి వెళ్లిపోయారు.

ఇలా  కార్యకర్తలు సమావేశాల్లో కొట్లాటలకు దిగడం, నాయకులు సమావేశాల మధ్యలోనే వెళ్లిపోవడం వంటి సీన్లు కాంగ్రెస్ సమావేశాల్లో పదే పదే కనిపిస్తున్నాయి. దీంతో సోనియాగాంధీ సభను విభేదాలు పక్కన పెట్టి విజయవంతం ఎలా చేయాలో తెలియక సీనియర్ కాంగ్రెస్ లీడర్లు తలలు పట్టుకుంటున్నారు.

You may also like

Leave a Comment