Telugu News » Kavitha : ఈడీ నోటీసులపై కవిత రియాక్షన్!

Kavitha : ఈడీ నోటీసులపై కవిత రియాక్షన్!

ఈ వ్యవహారం ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉందని టీవీ సీరియల్‌ లా కొనసాగిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. మళ్లీ ఒక ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తున్నారని విమర్శించారు.

by admin
kavitha reaction on ed notice

– మళ్లీ డ్రామా షురూ చేశారు
– టీవీ సీరియల్ లా సాగదీస్తున్నారు
– ఎన్నికలొస్తున్నాయని ఇంకో ఎపిసోడ్
– ఈడీ నోటీసుల్ని పట్టించుకోవద్దు
– లీగల్ టీమ్ చూసుకుంటుందన్న కవిత

ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కాం కేసుపై ఈడీ మరోసారి దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు నోటీసులు పంపగా.. ఆమె స్పందించారు. హైదరాబాద్ (Hyderabad) లో మీడియాతో మాట్లాడిన కవిత.. కేంద్రంపై మండిపడ్డారు. తనకు మోడీ (Modi) నోటీసులు అందాయని సెటైర్లు వేశారు. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే నోటీసులు వచ్చాయని మండిపడ్డారు.

kavitha reaction on ed notice

ఈడీ (ED) నోటీసులను తమ పార్టీ లీగల్‌ టీమ్‌ కు ఇచ్చామని.. వాళ్ల సలహా ప్రకారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు కవిత. ఈ వ్యవహారం ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉందని టీవీ సీరియల్‌ లా కొనసాగిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. మళ్లీ ఒక ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తున్నారని విమర్శించారు. తాజా విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదని వ్యాఖ్యానించారు.

గతంలో 2జీ విచారణ కూడా చాలాకాలం సాగిందన్న కవిత.. తెలంగాణ ప్రజలు దీన్ని సీరియస్‌ గా తీసుకోరని అన్నారు. బీఆర్‌ఎస్ ఎవరికీ బీ టీమ్‌ కాదని.. తమది తెలంగాణ, దేశ ప్రజల ఏ టీమ్‌ అని తెలిపారు.

గతంలో మూడు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. చాలాకాలంగా ఈ కేసు విషయాలు ఏవీ బయటకు రాలేదు. కానీ, ఇటీవల అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌ గా మారారు. 164 కింద ఈడీ అధికారులకు పిళ్లై వాంగ్మూలం ఇచ్చారు. కవిత బినామీగా పిళ్లైపై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో కవితకు నోటీసులు పంపిన ఈడీ శుక్రవారం ఢిల్లీలో హాజరు కావాలని ఆదేశించింది.

You may also like

Leave a Comment