Telugu News » South Korea: విజయవంతంగా కక్ష్యలోకి సౌత్ కొరియా నిఘా ఉపగ్రహం..!

South Korea: విజయవంతంగా కక్ష్యలోకి సౌత్ కొరియా నిఘా ఉపగ్రహం..!

డిసెంబరులో తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని (A military intelligence satellite) ప్రయోగించిన సంగతి తెలిసిందే. తాజాగా దేశీయంగా తయారుచేసిన రెండో నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

by Mano
South Korea: South Korea's surveillance satellite successfully launched into orbit..!

2025వరకు ఐదు ఉపగ్రహాలను పంపాలనే లక్ష్యంతో ఉంది దక్షిణ కొరియా(South Korea). గతేడాది డిసెంబరులో తొలి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని (A military intelligence satellite) ప్రయోగించిన సంగతి తెలిసిందే. తాజాగా దేశీయంగా తయారుచేసిన రెండో నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

South Korea: South Korea's surveillance satellite successfully launched into orbit..!

అమెరికాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష స్థావరం నుంచి స్పేస్‌ ఎక్స్‌(Space X) కంపెనీకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ (Falcon 9 Rocket) ద్వారా సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. గత నవంబరులో ప్రకటించిన తర్వాత వారం రోజులకే దక్షిణ కొరియా తన ప్రప్రథమ సైనిక గూఢచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

సియోల్‌ ప్రయోగించిన తొలి ఉపగ్రహం సెంట్రల్‌ ప్యాంగ్యాంగ్‌కు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను పంపింది. జూన్‌ నుంచి అది పూర్తిస్థాయి కార్యకలాపాలను మొదలుపెట్టింది. ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఈ ఫొటోలు అందుతాయని సియోల్ మీడియా వెల్లడించింది. దక్షిణ కొరియా తమ ప్రధాన శత్రవుని ప్యాంగ్యాంగ్ వర్గాలు ఈ ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఉత్తర కొరియాకు రష్యా నుంచి మద్దతు లభించినట్లు సియోల్ ఆరోపించింది. అనుకున్నట్లుగానే ఐదు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరితే ఉత్తర కొరియాలోని ప్రధాన స్థావరాలన్నింటిపై నిఘాపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఆయా ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలను చేరవేస్తుందని సియోల్‌ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

You may also like

Leave a Comment