Telugu News » Spice Jet : ఆర్థిక కష్టాల్లో ఎయిర్ లైన్స్‌.. జీతాలు చెల్లించలేక ఉద్యోగుల తొలగింపు..!

Spice Jet : ఆర్థిక కష్టాల్లో ఎయిర్ లైన్స్‌.. జీతాలు చెల్లించలేక ఉద్యోగుల తొలగింపు..!

తమ సంస్థలో పని చేస్తున్న 1400 మందిని తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఐటీ, బ్యాంకు (Bank) రంగాలు మాత్రమే ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి అనుకుంటే.. తాజాగా ఆ పరిస్థితి విమానయాన సంస్థలకు కూడా వ్యాపించడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.

by Venu

ప్రపంచాన్ని కరోనా (Covid) మహమ్మారి పట్టి పీడించిన తరువాత ప్రపంచంలోని పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ప్రభావం దాదాపు అన్ని వ్యాపార సంస్థల మీద కనిపించింది. ఈ నేపథ్యంలో ఐటీ (IT) కంపెనీలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంకా ఈ తొలగింపులు అలాగే కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్‌ (Airlines) స్పైస్‌ జెట్‌ (Spice Jet) ఉద్యోగులకు షాకిచ్చింది.

తమ సంస్థలో పని చేస్తున్న 1400 మందిని తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఐటీ, బ్యాంకు (Bank) రంగాలు మాత్రమే ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి అనుకుంటే.. తాజాగా ఆ పరిస్థితి విమానయాన సంస్థలకు కూడా వ్యాపించడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం స్పైస్‌ జెట్‌ ఎయిర్‌ లైన్స్‌ లో సుమారు 9 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 30 విమానాలు నడుస్తున్నాయి. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలే రూ. 60 కోట్ల వరకు అవుతోందని అంటున్నారు.

అయితే గత కొంత కాలం నుంచి ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వ్యయాన్ని తగ్గించుకునే దిశగా ఆలోచించిన స్పైస్‌ జెట్‌ సంస్థ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. మరోవైపు ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి ఇప్పటికే ఫోన్‌ ద్వారా సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా చాలా కాలం నుంచి సంస్థలోని కొంతమందికి జీతాలు చెల్లించే విషయంలో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.

ఆర్థిక పరిస్థితులు మందగించడంతో చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని స్పైస్‌ జెట్‌ సంస్థ తెలిపింది. పెండింగ్ వేతనాలతో పాటు ఇతర అవసరాల కోసం సంస్థ రూ. 2,200 కోట్ల వరకు నిధులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. నగదు కొరత సమస్య వల్ల పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో నిధులు లభించడం కష్టంగా మారిందని తెలుస్తోంది.

You may also like

Leave a Comment