క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్(IPL) సీజన్ ఈ వారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ చెన్నై(Chennai)లోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ షురూ అయింది. ఈ నేపథ్యంలో పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ(Viral Kohli) మరోసారి విజృంభిస్తున్నాడు. వరుసగా చెన్నైపై 21, పంజాబ్‌పై 77, కోల్‌కతాపై 82 పరుగులు తీశాడు.
తొలి మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో కోహ్లీ టాప్ ఆఫ్ ది స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే ఆర్‌సీబీ జట్టులో కోహ్లీ మినహా మిగతా ప్లేయర్లు అంతగా రాణించకపోవడమే. దీనిపై పలువురు సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వన్ మ్యాన్ షో ఇంకెంతకాలం చూడాలి.. మిగతావారు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
గత సీజన్లలో అదరగొట్టిన కెప్టెన్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటీదార్ పాటు కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్ ప్రదర్శన ఇప్పుడు ఘోరంగా ఉంది. దీంతో బెంగళూరు బ్యాటింగ్ యూనిట్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం టాపార్డర్‌లో విరాట్ ఒక్కడిపైనే జట్టు ఆధారపడుతుందో తెలియడం లేదని వ్యాఖ్యానించాడు. కప్ ను సాధించాలనే కల నెరవేరాలంటే సమష్ఠిగా రాణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
“విరాట్ కోహ్లి ఇంకెంతకాలం ఒక్కడే జట్టును లాక్కొని రాగలడు. ఎవరో ఒకరు అతడికి సహకారం అందించాలని మీకు (బెంగళూరు బ్యాటర్లను ఉద్దేశించి) అనిపించడం లేదా? కోల్ కతాతో మ్యాచ్లో ఎవరైనా క్రీజ్‌లో ఉండుంటే.. 83 పరుగులు కాకుండా కనీసం 120 రన్స్ చేసేవాడు. క్రికెట్ జట్టుగా ఆడే ఆట. కేవలం ఒక్కరి వల్లే మ్యాచ్ ఆధిపత్యం ప్రదర్శించడం కష్టం. కోహ్లికి సరైన మద్దతు దొరకడం లేదు” అంటూ గావస్కర్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉండగా, రన్ మెషిన్ కోహ్లీ శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున కోహ్లీ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 83* పరుగులు చేసి తిరుగులేని ప్లేయర్ అనిపించుకున్నాడు. ఒకే స్టేడియంలో అత్యధికంగా టీ 20లో 3,276 పరుగులు తీసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ తర్వాత ముష్ఫికర్ రహీమ్ (3,239 పరుగులు), అలెక్స్ హేల్స్ (3,036 పరుగులు), తమీమ్ ఇక్బాల్ (3,020 పరుగులు) ఉన్నారు.