Telugu News » Supreme Court : ప్రశ్నకు నోటు కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. !

Supreme Court : ప్రశ్నకు నోటు కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. !

లంచం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందించారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను బలపరుస్తుందని అన్నారు.

by Venu

ఎంపీ (MP), ఎమ్మెల్యే (MLA)ల లంచం కేసులపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం సంచలన తీర్పును వెల్లడించింది. లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా నేడు ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

supreme-court-says-manipur-panels-report-shows-need-to-upgrade-compensation

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలో, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ప్రకటించింది. లంచం కేసుల్లో చట్టసభ సభ్యులకు ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పార్లమెంటు, అసెంబ్లీలలో లంచాలు తీసుకుంటే ఎవరైనా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది.

మరోవైపు 1998లో లంచం కేసుల్లో చట్టసభ్యులకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. లంచానికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ లేదని 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని CJI జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. లంచం ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తుందని అందువల్ల ఉపేక్షించలేమని తెలిపారు.

ఇదిలా ఉండగా లంచం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందించారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను బలపరుస్తుందని అన్నారు. ప్రజలకు వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించేలా ఉందని ట్వీట్ చేశారు. చట్ట సభల్లో ప్రసంగించేందుకు, ఓటు వేయడానికి లంచం తీసుకొన్న సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు.

You may also like

Leave a Comment