Telugu News » Talasani: డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ఎప్పుడంటే..?

Talasani: డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ఎప్పుడంటే..?

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తోందన్నారు.

by Prasanna
talasani

తెలంగాణ (Telangana) రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల రెండో విడత పంపిణీ కోసం ఇవాళ హైదరాబాద్ (Hyderabad) కలెక్టరేట్ కార్యాలయంలో ఇండ్ల కేటాయింపు డ్రా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రలు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొన్నారు.

talasani

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ… హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తం 13200 ఇళ్లకు సంబంధించి ఈ రోజు డ్రా తీశామనీ, వీరికి ఈ నెల 21 న డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయనున్నామని తెలిపారు. లబ్ధిదారుల అడ్రస్ మారితే వారు ఇది వరకు ఇచ్చిన అడ్రస్ కే సమాచారం చేరుతుందనీ దీన్ని లబ్ధిదారులు గమనించుకోవాలని తెలిపారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తోందన్నారు. ఢిల్లీలో అధికారులకు ఇచ్చే క్వార్టర్స్ తరహాలో ఈ ఇళ్లు ఉన్నాయంటూ మాజీ గవర్నర్ నరసింహన్ గతంలో చేసిన కామెంట్స్ ను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. 2 బీహెచ్ కే లను కూడా రిజర్వేషన్ ప్రాతిపదికనే అందిస్తామన్నారు. మూసీ నది ప్రాంతంలో ఆక్రమణలో ఉన్న వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు. అవసరమనుకుంటే మరిన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

You may also like

Leave a Comment