తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగుతున్న సీపీఎం (CPM).. కాంగ్రెస్ (Congress) బీజేపీ, బీఆర్ఎస్ పై పలు విమర్శలకు దిగింది. మునుగోడు ఎన్నికలప్పుడు ఒడిపోతుందనే భయంతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్.. అవసరం తీరాక ఇప్పుడు సీపీఎంని కాదనుకుందని రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.
కాంగ్రెస్ కూడా పొత్తు పొత్తు అంటూ కాలయాపన చేసిందని.. తీరా సమయం వచ్చేసరికి తప్పించుకుందని తమ్మినేని విమర్శించారు. మాకు ఒంటరి పోరాటం కొత్త కాదన్న తమ్మినేని.. మా మిత్రుత్వం కాదనుకున్న పార్టీలు ఎంత మెజారిటీతో గెలుస్తాయో తెలుస్తుందని అన్నారు. మీరు పొత్తుకు రాకుంటే మేము పోటీలో ఉండలేమా.. అందుకే 19 నియోజకవర్గలో పోటీకి దిగుతున్నామని తెలిపారు.
మరోవైపు బీఆర్ఎస్ (BRS) కాంగ్రెస్ పార్టీల స్వభావం మాకు తెలుసన్న తమ్మినేని.. రెండు పార్టీలు భూర్జువా స్వభావం కలిగి ఉన్నవే అని పేర్కొన్నారు. ఇక మునుగోడు ఎన్నికల తర్వాతనే బీజేపీ (BJP) డౌన్ ఫాల్ అయ్యిందని.. అయితే బీజేపీకి భయపడి కేసీఆర్ (KCR) మమ్మల్ని దూరం చేశారని తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra) అన్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తుల వరకు వెళ్ళిన సీపీఎం.. సీట్ల సర్ధుబాటు అంశం తెగకపోవడంతో హస్తానికి దూరం జరిగింది. చావో రేవో తేల్చుకోవడానికి ఒంటరి పోరాటానికి సిద్దం అయ్యింది..