Telugu News » Tanzania: వరదల బీభత్సం.. 58 మంది మృతి..!

Tanzania: వరదల బీభత్సం.. 58 మంది మృతి..!

తూర్పు ఆఫ్రికా(East Africa)లోని టాంజానియా(Tanzania)లో వరదలు(Flooding) బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా రెండు వారాల వ్యవధిలో సుమారు 58 మంది మృతిచెందినట్లు అక్కడి అధికార యంత్రాంగం తెలిపింది.

by Mano
Tanzania: Flood disaster.. 58 people died..!

ఆఫ్రికా(Africa)లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు ఆఫ్రికా(East Africa)లోని టాంజానియా(Tanzania)లో వరదలు(Flooding) బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా రెండు వారాల వ్యవధిలో సుమారు 58 మంది మృతిచెందినట్లు అక్కడి అధికార యంత్రాంగం తెలిపింది. అదేవిధంగా కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలతో సుమారు 1,26,831 మంది ప్రభావితమయ్యారని ప్రభుత్వం తెలిపింది.

Tanzania: Flood disaster.. 58 people died..!

ఆదివారం బాధిత ప్రజలకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి మోభరే మతినీ(Mobhar Matini) వెల్లడించారు. భవిష్యత్తులో వరదలను నివారించడానికి టాంజానియా 14 డ్యామ్‌(Dam)లను నిర్మించాలని యోచిస్తోందని ఆయన చెప్పారు. అటు కెన్యాలో వరదల కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతిచెందారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు పెరిగాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ ఎల్నినో 2023లో సహజసిద్ధంగా ఉద్భవించింది. సాధారణంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో అక్టోబరు, డిసెంబర్ మధ్య తూర్పు ఆఫ్రికాలో కురిసిన వర్షపాతం ఇప్పటివరకు నమోదైన వాటిలో ఒకటి అని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్‌లోని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అయితే ఇప్పుడు వరదల తాకిడి మరింత పెరిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డిసెంబర్‌లోనూ ఉత్తర టాంజానియాలో కురిసిన వర్షానికి వరదలు సంభవించాయి. రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటేష్‌ పట్టణంలో భారీ వర్షం కారణంగా వరదల తాకిడికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో సుమారు 47మంది మృతిచెందారు. మరో వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

You may also like

Leave a Comment