స్టేషన్‌ఘన్‌పూర్ (Station Ghanpur), మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah), బీఆర్ఎస్ (BRS)ను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన కాంగ్రెస్ (Congress)లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ (Krishank) చేసిన ట్వీట్ వివాదాస్పదమవుతోంది.
ఇక రాజయ్య బీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఆయన కనబరచిన లీలల గురించి రాష్ట్రమంత తెలిసిందే.. మహిళల పట్ల ఆయన వ్యవహరించే తీరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇలా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న రాజయ్య కారు దిగిన అంశంపై స్పందిస్తూ.. థ్యాంక్యూ రాజయ్య గారు మొత్తానికి బీఆర్ఎస్‌ను వీడినందుకు.. మీరు చేరే పార్టీలోని మహిళలను ఆ దేవుడే రక్షించాలని క్రిషాంక్ ట్వీట్ చేశారు.
అయితే క్రిషాంక్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో మహిళలను వేధిస్తున్నట్లు తెలిసినా మీరేందుకు ఆయనపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అతనిలోని డార్క్ షేడ్ మీ పార్టీని వీడిన తర్వాతే గుర్తొచ్చిందా అని మండిపడుతున్నారు.. డర్టీ పాలిటిక్స్ అని కామెంట్స్ చేసిన నెటిజన్లు.. పింకీలు వుమనైజర్లని మీరు అంగీకరిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు..
మీ పార్టీలో ఉన్నప్పుడు మహిళల గురించి ఆలోచించావా అని కొందరు.. మైండ్ ఉండి మాట్లాడుతున్నావా? అని మరికొందరు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇన్నాళ్లు మీ పార్టీలో ఉన్న ఆడవాళ్లని మీరు సేవ్ చేయకుండా పబ్బం గడుపుతున్నారా? అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే మహిళల పట్ల రాజయ్య చర్యలు ఎన్నికల ముందు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అప్పుడు చర్యలు తీసుకోకుండా మహిళల మీద ఇప్పుడు ప్రేమ ఒలకబోయడం ఏంటని క్రిషాంక్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.