Telugu News » Atchannaidu : ఆయన డైరెక్షన్‌లో చంద్రబాబు హత్యకు ప్లాన్..అచ్చెన్నాయుడు..!?

Atchannaidu : ఆయన డైరెక్షన్‌లో చంద్రబాబు హత్యకు ప్లాన్..అచ్చెన్నాయుడు..!?

చంద్రబాబు తన ఆరోగ్యం పై ఏసీబీ కోర్టు జడ్జికి సైతం లేఖ రాశారు. తాజాగా చంద్రబాబు భద్రతపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో వ్యక్తులను చంపే టీమ్ రహస్యంగా ఉందని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు.

by Venu

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నాయుడు స్కిల్ స్కాం (Skill Scan)కేసులో అరెస్ట్ అయ్యి రోజులు గడుస్తున్నా ఇంకా బెయిల్ రావడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బాబు.. అక్కడి నుంచి పార్టీ ముఖ్య నేతలకు సూచనలు ఇస్తున్నారు. అయితే ఇప్పటికే పలు అనారోగ్యాలతో బాధపడుతున్న బాబు ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు..

ఈ నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్రను చేపట్టారు. మరోవైపు చంద్రబాబు తన భద్రత విషయంలో ఆందోళనలో ఉన్నారు.. టీడీపీ ముఖ్యనేతలు, బాబు కుటుంబం కూడా ఇప్పటికే బహిరంగంగా వారి అనుమానాన్ని వెలిబుచ్చారు.. ఈ క్రమంలో చంద్రబాబు తన ఆరోగ్యం పై ఏసీబీ కోర్టు జడ్జికి సైతం లేఖ రాశారు. తాజాగా చంద్రబాబు భద్రతపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో వ్యక్తులను చంపే టీమ్ రహస్యంగా ఉందని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి వారిని మెయింటన్ చేయడంలో జగన్ (Jagan) అండ్ టీం ఎక్సపర్ట్స్ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుట్టు చప్పుడు కాకుండా జైల్లో ఉన్న వాళ్లని చంపడంలో పట్టా పుచ్చుకొన్న గ్యాంగ్ జగన్ తో టచ్ లో ఉందని అచ్చెన్నాయుడు ఆరోపణలు గుప్పించారు.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి కాబట్టి బాబుకి ఏదైనా జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు..

ఈ అనుమానాలు నిజం అనేందుకు జైలుపై ఎగరేస్తున్న డ్రోన్లు సాక్ష్యం అన్నారు.. ఇంత జరుగుతోన్న ఎవరు పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు తెలిపారు.. చంద్రబాబును అంతం చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయనే లేఖలు వచ్చినా విచారణ జరపడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లో ఈ మొత్తం వ్యవహరం నడుస్తుండడం ఆందోళనకి గురిచేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు..

You may also like

Leave a Comment