Telugu News » TDP-Jana Sena : విజయవాడలో కీలక సమావేశం నిర్వహించిన టీడీపీ-జనసేన..!!

TDP-Jana Sena : విజయవాడలో కీలక సమావేశం నిర్వహించిన టీడీపీ-జనసేన..!!

ఏపీ (AP)లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలలో భాగంగా 175 నియోజకవర్గాలు పర్యటించాలని సమన్వయ కమిటీ నిర్ణయించినట్టు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ పలు సమావేశాలు నిర్వహిస్తుండగా.. ఈ సారి జనసేనతో కలిసి పలు నియోజకవర్గాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్టు అచ్చెన్న పేర్కొన్నారు.

by Venu

గతంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఈ రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ కోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జనసేన కమిటీ ఏర్పాటు చేయగా.. టీడీపీ ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. వీటి మధ్య ఒక సారి సమావేశం కూడా జరిగింది. తాజాగా టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ విజయవాడలో రెండోసారి సమావేశమైంది.

ఈ సమావేశానికి టీడీపీ (TDP) జనసేనకు (Jana Sena)చెందిన ముఖ్యనేతలు అందరూ పాల్గొన్నారు. కాగా భవిష్యత్తుకు గ్యారెంటీ (Future Guarantee) పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achchennaidu) తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 17 నుంచి జనసేనతో కలిసి ఇంటింటికి వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. మరో వైపు ప్రజలకు ఉపయోగంగా ఉండేలా మేనిఫెస్టో రూపకల్ప (Manifesto Design) చేయడం కోసం ఈ సమావేశం నిర్వహించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

ఇక ఏపీ (AP)లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలలో భాగంగా 175 నియోజకవర్గాలు పర్యటించాలని సమన్వయ కమిటీ నిర్ణయించినట్టు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ పలు సమావేశాలు నిర్వహిస్తుండగా.. ఈ సారి జనసేనతో కలిసి పలు నియోజకవర్గాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్టు అచ్చెన్న పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుందన్న అచ్చెన్న.. సీఎం జగన్ (Jagan) మాత్రం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో ముందుకు వెళ్తుందని మభ్యపెట్టడం సరికాదని మండిపడ్డారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి జనసేన- టీడీపీ అందరిని కలుపుకోవడానికి సిద్దం అయినట్టు వెల్లడించారు. ఇకపై ప్రతి పదిహేను రోజులకు ఓ సమావేశం నిర్వహించెలా ప్రణాళికా సిద్దం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.

You may also like

Leave a Comment