Telugu News » TDP-Janasena New Logo : టీడీపీ-జనసేన కొత్త లోగో.. ఆవిష్కరించిన అచ్చెన్న..!!

TDP-Janasena New Logo : టీడీపీ-జనసేన కొత్త లోగో.. ఆవిష్కరించిన అచ్చెన్న..!!

జగన్ పాలనలో విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించిన అచ్చెన్న.. ఆంధ్రప్రదేశ్ ని ఆందోళన ప్రదేశ్ గా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని దుయ్యబట్టారు.

by Venu

టీడీపీ (TDP).. జనసేన (Janasena)నేతలు వైసీపీ (YCP) అసంతృప్తులను చూసి సంబరపడుతున్నారు కానీ తమ పార్టీల్లో ఎదురవ్వబోయే సమస్యలను మరచినట్లున్నారని అనుకొంటున్నారు.. దీనికి కారణం రెండు పార్టీల మధ్య పొత్తు ఫైనల్ అయ్యింది కానీ, ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీ చేస్తోంది. పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏంటన్నది ఇంకా ఫైనల్ కాలేదనే మాటలు ఏపీలో వినిపిస్తున్నాయి..

అయితే ఇదంతా పక్కన పెట్టిన టీడీపీ.. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా రేపటి నుంచి “రా కదలి రా!” పేరిట కార్యక్రమాలు నిర్వహించబోతోంది.. ఈ క్రమంలో తెలుగుదేశం-జనసేన గుర్తులు కలిసి ఉన్న, సైకిల్, గాజు గ్లాసుతో కూడిన లోగో అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి పాల్గొనే సభలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు..

జగన్ పాలనలో విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప అభివృద్ధి అనేది భూతద్దంలో వెతికినా కనిపించదని విమర్శించిన అచ్చెన్న.. ఆంధ్రప్రదేశ్ ని ఆందోళన ప్రదేశ్ గా మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని దుయ్యబట్టారు. స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. అన్ని సభలు తెలుగుదేశం, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు.

మరోవైపు రేపు సర్పంచులతో పంచాయితీల సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సునిర్వహించనున్నారు. 4వ తేదీన జయహో బీసీ పేరిట.. బీసీలకు జరిగిన అన్యాయంపై గర్జించడానికి రాష్ట్ర స్థాయి సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదీగాక.. 5వ తేదీ నుంచి 29 వరకూ 22 పార్లమెంట్ స్థానాల్లో బహిరంగ సభలు.. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు, 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ బహిరంగసభ ఏర్పాట్లలో టీడీపీ నేతలు బిజీ బిజీగా ఉన్నారు..

You may also like

Leave a Comment