పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలక ఫైల్స్ మాయమైన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. ఈ ఇష్యూను రేవంత్ (Revanth) సర్కార్ సీరియస్‌గా తీసుకొంది. ఈ కేసుతో పాటు గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలపై ఫోకస్ పెట్టింది. అదీగాక బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి..
ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ రెండు కేసులను ఏసీబీ (ACB)కి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని తేలింది. ఇటీవల గచ్చిబౌలి (Gachibowli)లో అధికారులపై కేసు నమోదు చేశారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. పలు చోట్ల కంప్యూటర్లు, ప్రభుత్వ ఫైళ్ల మాయం, దగ్ధం ఘటనలు చోటు చేసుకొన్నాయి.
మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలోనూ ఫైల్స్ అదృశ్యం ఘటన చోటు చేసుకొంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం అయ్యాయి. కిటికీ గ్రిల్స్ తొలగించిన దుండగులు ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఓఎస్డీ కళ్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదేకాకుండా గొర్రెల యూనిట్ల పంపిణీలో సైతం అక్రమాలు చోటు చేసుకున్నట్లు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం గుర్తించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఈ పథకం కింద పెద్ద ఎత్తున నిధులు పక్కదారిపట్టినట్లు గుర్తించారు. ఒకవేళ అవినీతి జరగకుంటే.. ఈ చర్యలు ఎంతనే వాదన రాష్ట్రంలో వినిపిస్తోంది. తప్పు చేశారు కాబట్టే తప్పించుకొనే ప్రయత్నాలు జరుగుతోన్నట్టు చర్చించుకొంటున్నారు.