Telugu News » Telangana: తెలంగాణలో మరో భారీ స్కామ్..!

Telangana: తెలంగాణలో మరో భారీ స్కామ్..!

మరో భారీ స్కామ్‌ను అధికారులు గుర్తించారు. ఈసారి ఆవుల పంపిణీలో దాదాపు రూ.3కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు.

by Mano
Telangana: Another huge scam in Telangana..!

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ స్కామ్‌లను ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల గొర్రెల స్కామ్(sheep scam) విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరో భారీ స్కామ్‌ను అధికారులు గుర్తించారు. ఈసారి ఆవుల పంపిణీలో దాదాపు రూ.3కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు.

Telangana: Another huge scam in Telangana..!

డబ్బుల చెల్లింపులో తేడా రావడంతో ముఠా సభ్యులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే గొర్రెల స్కామ్‌లో రూ.2.10 కోట్లు మోసం జరినట్లు ఆధారాలతో సహా నిరూపితం కాగా ఆ కేసులో నలుగురు నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇక, ఆవుల పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లోకి నిధులు జమ అయినట్లు తెలుస్తోంది.

గొర్రెల పంపిణీలో స్కామ్ చేసిన ముఠానే.. ఆవుల పంపిణీలో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఏసీబీ డీజీకి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇది పుంగనూరు సరఫరాదారులను ముఠా సభ్యుల పనేనని స్పష్టమవుతోంది. 2022 జనవరిలో రైతులకు ఆవుల పంపిణీకి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఆవుల యూనిట్‌కు రూ.70వేల చొప్పున అధికారులు ఈ స్కీమ్‌కు ఫిక్స్ చేశారు.

దీంతో చిత్తూరు జిల్లా పుంగనూరు సరఫరాదారులను అధికారులు ఆశ్రయించారు. 12 మంది నుంచి సుమారు 1200 యూనిట్లను అధికారులు కొనుగోలు చేశారు. ఆవుల కొనుగోలుకు దాదాపు ఎనిమిదిన్నర కోట్లను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. సరఫరా పూర్తె నెలలు దాటినా రూ.4కోట్లు మాత్రమే సరఫరాదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. సంబంధం లేని ఖాతాలకు సుమారు రూ.4కోట్ల 50 లక్షలు మళ్లినట్లు నిర్ధారణ అయింది.

You may also like

Leave a Comment