వివాదాస్పద ఎమ్మెల్యేగా పాపులారిటీ సంపాదించుకున్న గోషామహల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh)పై ఇప్పటికే అనేక కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఏఎక్కడో ఒక చోట, ఏదో ఒక కార్యక్రమంలో మతం, కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)వేళ తాజాగా రాజాసింగ్ కు మరోసారి షాక్ తగిలింది.
రాజాసింగ్‌పై మరో రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు (Policelu) ఈ సారి దాండియా నేపథ్యంలో మాట్లాడిన మాటలపై ఒక కేసు నమోదు చేయగా.. నామినేషన్ రోజు విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.. ఇప్పటికే దసరా సందర్భంగా చేసిన ఆయుధ పూజకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. రాజాసింగ్ వారం రోజుల్లోగా ఆ నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
మరోవైపు ఈ రెండు కేసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనను ఎన్నికల నుంచి తప్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తుందని ఒక వీడియో కూడా విడుదల చేశారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు కూడా ఆయుధ పూజలు చేశారని తెలిపిన రాజాసింగ్.. వారిపై కూడా కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు.. గోషామహల్ నుంచి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పన్నిన వ్యూహంలో నన్ను ఇరికిస్తున్నారని రాజాసింగ్ అన్నారు.. ఇదంతా కుట్రతో చేస్తున్న పని అని ఎమ్మెల్యే ఆరోపించారు.