Telugu News » Telangana Assembly : హాట్ హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు.. శ్వేత పత్రంపై అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

Telangana Assembly : హాట్ హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు.. శ్వేత పత్రంపై అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు

దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేయాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేసిన శ్రీధర్ బాబు.. రాష్ట్రాన్ని ఐదేళ్లలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశం హాట్ హాట్‌గా సాగుతోంది. నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయడంతో.. పలు విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.. రాష్ట్ర ప్రభుత్వం గత పదేండ్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రంపై ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య వార్ పిక్ లోకి వెళ్తుందని సమాచారం.. ఈ క్రమంలో చాంద్రాయణ గుట్ట (Chandrayana Gutta) ఎమ్మెల్యే, ఎంఐఎం ఎల్పీ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) శ్వేత పత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం శ్వేత పత్రం ఎందుకు విడుదల చేసినట్టని ప్రశ్నించిన అక్బరుద్దీన్ ఓవైసీ.. రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు లేవని ప్రభుత్వం వెల్లడించడం వెనుక ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని అడిగారు.. తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం సరికాదని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పరిశ్రమలకు ఇలాంటి శ్వేత పత్రాల వల్ల తప్పుడు సంకేతాలు అందుతాయని అక్బరుద్దీన్ ఓవైసీ వివరించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో వాళ్లకు అనుకూలంగా ఉన్నవి మాత్రమే చూపించారని అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.. ఇక తెలంగాణ అప్పులు పెరిగిన మాట వాస్తవమేనని.. కానీ రాష్ట్రంలో అభివృద్ధి కూడా గణనీయంగా జరిగిందని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. తెలంగాణ ముమ్మాటికీ లాభదాయక రాష్ట్రామేనని నొక్కి చెప్పారు.

ఇదిలా ఉండగా అక్బరుద్దీన్ మాటలకు మంత్రి శ్రీధర్ బాబు (Shridhar Babu) కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం అప్పులు చేసిందని తెలపడం తమ ఉద్దేశం కాదని.. చేసిన అప్పులు ఎందుకు కోసం చేశారనేది ప్రజలకు తెలియపరచడానికే శ్వేత పత్రం విడుదల చేసినట్టు తెలిపారు.. దేశంలో తెలంగాణను నెం.1 చేయాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేసిన శ్రీధర్ బాబు.. రాష్ట్రాన్ని ఐదేళ్లలో నెం.1గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు..

You may also like

Leave a Comment