తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election) ఒక ముఖ్య ఘట్టం ముగిసింది.. రాష్ట్రంలో జనసేన (Janasena) పోటీ పై నెలకొన్న ఉత్కంఠ తొలగింది. ఇప్పటికే ఆయా స్థానాల అభ్యర్థులని ప్రకటించిన జనసేన.. వారికి బీ ఫామ్ అందచేసింది. పొత్తులో భాగంగా బీజేపీ.. జనసేనకు 8 సీట్లు కేటాయించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులకు పార్టీ చీఫ్.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీఫామ్‌లు అందించారు.
హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన చీఫ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చారు. మరోవైపు నామినేషన్లు దాఖలు చేసేందుకు 48 గంటల సమయం మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.. మరోవైపు.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సీటు విషయం ఆసక్తికరంగా మారింది. శేరిలింగంపల్లి స్థానం కోసం జనసేన పట్టుపడుతుండగా.. బీజేపీ నేతలు ససేమిరా అంటున్నారని ప్రచారం.
నామినేషన్లకు రెండు రోజులే సమయం మిగిలి ఉన్న నేపధ్యంలో ఈ సీటు ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాలలో నెలకొంది.. కాగా తొలిసారిగా ప్రత్యక్షంగా తెలంగాణ ఎన్నికల బరిలోకి జనసేన దిగడం జనసైనికులకు ఉత్సాహాన్నిస్తుందని అంటున్నారు.. మరోవైపు తెలంగాణ అభివృద్ధి సాధనకు జనసేన కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నేరవేరాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కోరారు..
ఇక బీ ఫామ్ అందుకున్న నేతలు వీరే..
ఖమ్మం- మిర్యాల రామకృష్ణ.. కొత్తగూడెం- లక్కినేని సురేందర్‌రావు.. అశ్వారావుపేట(ఎస్టీ)- ముయబోయిన ఉమాదేవి.. కూకట్‌పల్లి- ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్.. కోదాడ- మేకల సతీష్‌రెడ్డి.. తాండూరు- నేమూరి శంకర్‌గౌడ్.. వైరా(ఎస్టీ)- డా.తేజావత్ సంపత్ నాయక్.. నాగర్ కర్నూల్- వంగల లక్ష్మణ్ గౌడ్..