తెలంగాణ (Telangana) ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధనకు దోహదపడింది. కానీ రాష్ట్ర అభివృద్దికి మాత్రం ఏ విధంగా ఉపయోగపడలేదనేది మేధావుల అభిప్రాయం. ఉద్యమాలు చేసింది ఎవరు? ప్రాణాలు అర్పించింది ఎవరు? ఎన్ని మాయల ఫకీర్ హామీలు.. ఎన్ని పిట్టల దొర వేషాలు.. ఈ మాటలు ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారం శాశ్వతం కాదనే వేదాంతం గుర్తుకు వస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణలో జరిగిన ఎన్నికలు పార్టీలకు ఎలాంటి గుణాపాఠాన్ని నేర్పిస్తాయో అనే ఆసక్తి నెలకొంది.
అయితే ఇప్పటి వరకు అధికారం తమదే అనే ధీమాలో బీఆర్ఎస్ (BRS) ఉన్నదన్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న గులాభి బాస్ కు.. తాను చేసిన రాజశ్యామల యాగం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో అని అనుకుంటున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో (southern states) వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి (CM) అయిన చరిత్ర ఉందా? అని గమనిస్తే.. అలాంటి చరిత్ర ఇప్పుడు మొదలైతేనే తెలంగాణ రాజకీయం కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు.
ఈ క్రమంలో డిసెంబర్ మూడున తెలంగాణలో ఏం జరగబోతోందనేది ఆసక్తి కరంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు రథం అధిరోహిస్తేనే కేసీఆర్ (KCR) ముచ్చటగా మూడోసారి సీఎం అవడమే కాదు.. సరికొత్త రికార్డునూ నెలకొల్పుతారు. అయితే ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో రెండు సార్లకు మించి ముఖ్యమంత్రి అయిన చరిత్ర లేదు.
మరోవైపు చరిత్రను పరిశీలిస్తే.. తమిళనాడు.. ఎం కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత.. కర్ణాటకకు వస్తే నిజలింగప్ప, డి. దేవరాజ్ ఉర్స్, బీఎస్ యడియూరప్ప, సిద్ధరామయ్య.. కేరళకు వస్తే.. అచుతా మీనన్, కె. కరుణాకరన్, ఎ.కే ఆంటోనీ, పినరయ్ విజయన్.. చివరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వస్తే.. నీలం సంజీవరెడ్డి, నందమూరి తారకరామారావు, చంద్రబాబు వీరంతా ముఖ్య మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన వారే..
అయితే వీరంతా వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రులు అయినవారు కాదు. ఒకవేళ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రులు అయినా పూర్తి పదవీకాలం బాధ్యతల్లో లేరు. మరోవైపు మూడుసార్లు వరుసగా ఎన్నికవ్వలేదు. అంటే మూడో సారి ముఖ్యమంత్రి అవడం అంటే ఎడారిలో నీళ్ళు లేకుండా బ్రతడం అంత కష్టం అని తెలుస్తుంది. ఇన్ని కష్టాలను దాటి కేసీఆర్ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యి దక్షిణాది రాష్ట్రాల్లో చెరగని చరిష్మా ఉన్న నాయకుడిగా సరికొత్త రికార్డును నెలకొల్పుతారా? అనేది ఒక పజిల్ లా మారింది. దీనికి సమాధానం డిసెంబర్ 3న దొరుకుతుంది..