Telugu News » KTR : ముందే ఓటమిని గుర్తించి హింట్ ఇచ్చిన కేటీఆర్..??

KTR : ముందే ఓటమిని గుర్తించి హింట్ ఇచ్చిన కేటీఆర్..??

ట్వీట్ లో చాలా కాలం తర్వాత నిన్న రాత్రి బాగా నిద్రపోయానని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.. అయితే ఈ ట్వీట్ కు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చారు. నిన్న కేటీఆర్ పెట్టిన గురి తప్పలేదు, కారు నాలుగు టైర్లు పేల్చేశాడంటూ సెటైర్లు వేశారు.

by Venu

తెలంగాణ (Telangana) రాజకీయాలు గమ్మత్తుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో శరవేగంతో దూసుకెళ్లిన కారు.. రిజల్ట్ లో మాత్రం ఆర్డినరీ బస్సులా జరక్కులిస్తూ ముందుకు సాగిందని అంటున్నారు. ఇక కేటీఆర్ (KTR) మాత్రం తెలంగాణలో ఎప్పుడైనా విజయం బీఆర్ఎస్ (BRS) వైపే ఉంటుందనే ప్రచారం జోరుగానే చేశారు.. చిరికి ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పుపట్టారు.

brs working president react on telangana elections results

కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు అన్నీ కాంగ్రెస్ (Congress)కు అనుకూలంగా వచ్చాయి. మరోవైపు నేతల్లో కారు డ్యామేజ్ కాకుండా కేటీఆర్ బాగానే కవర్ చేశారని తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగా ట్విట్టర్ (Twitter)లో కేటీఆర్ పలు పోస్టులు పెట్టడం ఎన్నికల ఫలితాలకు ముందు బాగానే ఉన్నా.. ఎన్నికల రిజల్ట్ తర్వాత అవే పోస్టులు రివర్స్ గా మారి తుపాకి తూటాలుగా పేలుతున్నాయని అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు..

అయితే నిన్న మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన కేటీఆర్‌ అందులో “హ్యాట్రిక్ లోడింగ్ 3.o.. గెట్ రెడీ సెలబ్రేటీ గాయ్స్” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అనే ధీమాలో ఉన్నారు అభిమానులు. అదీగాక నిన్న ఉదయం కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్మవద్దని, ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మరోవైపు ఆ ట్వీట్ లో చాలా కాలం తర్వాత నిన్న రాత్రి బాగా నిద్రపోయానని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.. అయితే ఈ ట్వీట్ కు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కౌంటర్ ఇచ్చారు. నిన్న కేటీఆర్ పెట్టిన గురి తప్పలేదు, కారు నాలుగు టైర్లు పేల్చేశాడంటూ సెటైర్లు వేశారు. ఇక హాయిగా ఎమ్మెల్యేగా నిదురపో అని కూడా పేర్కొన్నారు.. మరోవైపు బీఆర్ఎస్ ఓటమిని గుర్తించిన కేటీఆర్ తుపాకి గురిపెట్టి హింట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

You may also like

Leave a Comment