Telugu News » Congress : బీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చిన కాంగ్రెస్.. నోటీసులు జారీ చేసిన ఈసీ..!!

Congress : బీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చిన కాంగ్రెస్.. నోటీసులు జారీ చేసిన ఈసీ..!!

తాజాగా బీఆర్ఎస్ కు కూడా ఈసీ నోటీసులు అందచేసింది. ఇప్పటికే ప్రధాన మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు కార్పోరేట్ స్థాయిలో చేస్తున్న యాడ్స్ లో తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవడమే కాదు ప్రత్యర్థి పార్టీలను కించపరుస్తూ సెటైరికల్ పంచులు వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ని స్కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ పెద్దఎత్తున ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

by Venu
Assembly Results: Congress is strong in Telangana.. big victory in two places..!

రాజకీయ పార్టీలు అధికారమే ఆశయంగా.. గెలుపే చివరి మజిలీలా భావిస్తూ మితిమీరిన ప్రసంగాలు చేస్తున్న విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎన్నికల నియమావళి అతిక్రమిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో ఇదివరకే కేటీఆర్‌ (KTR)కు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..

Telangana: No suspension on Telangana Tourism Organization MD.. because..?

అయితే తాజాగా బీఆర్ఎస్ (BRS)కు కూడా ఈసీ (EC) నోటీసులు అందచేసింది. ఇప్పటికే ప్రధాన మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు కార్పోరేట్ స్థాయిలో చేస్తున్న యాడ్స్ లో తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవడమే కాదు ప్రత్యర్థి పార్టీలను కించపరుస్తూ సెటైరికల్ పంచులు వేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress)ని స్కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ పెద్దఎత్తున ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ యాడ్స్ పై ఎన్నికల కమీషన్ రియాక్ట్ అయ్యింది.

కాంగ్రెస్ ను ‘స్కాంగ్రెస్’ అంటూ వ్యంగ్యంగా యాడ్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఈసీకి ఫిర్యాదు చేయగా.. ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) వెంటనే స్పందించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు జారీచేసారు. ఇరవైనాలుగు గంటల్లోగా తమ నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ ను ఆదేశించారు సీఈవో వికాస్ రాజ్..

ఇదిలావుంటే ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు ఈసీ నోటీసులు జారీచేసింది. కొత్తప్రభాకర్ రెడ్డి దాడిపై అతిగా స్పందించిన కేసీఆర్.. బాన్సువాడ బహిరంగ సభలో మాకు చేతులు లేవా! కత్తి పట్టలేమా! మాకు తిక్కరేగిందో దుమ్ము రేగుతుంది జాగ్రత్తంటూ ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్, ఈసీకి ఫిర్యాదు చేసింది.

వెంటనే స్పందించిన ఈసీ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో వుండి ఎన్నికల వేళ మతకలహాలకు కారణం అయ్యే వ్యాఖ్యలు చేయడం తగదని కేసీఆర్ కు సూచించింది. ఇకపై ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణించి.. తగిన చర్యలు తీసుకుంటామని ఈసీఐ అడ్వైజరీ కమిటీ హెచ్చరించింది..

You may also like

Leave a Comment