తెలంగాణా (Telangana)లో ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటికే పలువురు ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్ కూడా వేశారు. మరోవైపు కాంగ్రెస్.. రాష్ట్రంలో ఊహించని స్థాయిలో ప్రచారంలో దూసుకు పోతుంది. బీఆర్ఎస్ (BRS) వైఫల్యాలు అజెండాగా.. కాళేశ్వరం (Kaleswaram) అవినీతి అస్త్రంగా ఓటర్ల మైండ్ లోకి సూటిగా దూసుకుపోతుందని హస్తం కార్యకర్తలు సంబరపడుతున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ అవినీతి పై విన్నూత్నంగా ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.. పింక్ కలర్ (Pink Colour) కారుపై బీఆర్ఎస్ అవినీతి చిట్టాను అతికించి ప్రచారం కోసం కాంగ్రెస్ ఉపయోగిస్తుంది.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం అయిన గాంధీభవన్ వద్ద ఉన్న పింక్ కలర్ కారుని నాంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసీఆర్ పై అభ్యంతకర వ్యాఖ్యలు రాసి ఉన్నాయి కాబట్టి కారును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై అధికారిక సోషల్ మీడియా X లో స్పందించిన తెలంగాణ కాంగ్రెస్.. పోలీసుల తీరును ఖండించింది. స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు.. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం లేదా అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఎక్కడ కాంగ్రెస్ గెలుస్తుందో.. బీఆర్ఎస్ అవినీతి బట్టబయలు అవుతుందో అనే భయంతో తమ ప్రచారానికి అడ్డుతగులుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఆపాలని చూస్తే.. ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నేతలు అంటున్నారు.. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు స్కాముల్లో BRSకి సంబంధం ఉందని వివరిస్తూ పింక్ కారును ప్రదర్శింది.. రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా బీఆర్‌ఎస్ డబ్బు సంపాదిస్తున్నదని అర్థం వచ్చేలా.. కేసీఆర్ (KCR) పాలనను 90 ఎంఎల్ ప్రభుత్వంగా ఆరోపిస్తూ ఉన్న పోస్టర్ ను కాంగ్రెస్ నేతలు ఆ కారుపై ముద్రించారు..