తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉండటం వెనక మర్మం అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే హస్తం అధికారం తమదే అనే ధీమాతో సంబరపడుతున్నట్టు తెలుస్తుంది. ఒక వేళ రాష్ట్రంలో కారు స్క్రాప్ అయ్యిందా? అనే అనుమానాలు కూడా మొలకెత్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి కాంగ్రెస్ కృషి ఫలిస్తే అధికారం చేపట్టడం ఖాయం అనే చర్చలు అప్పుడే తెలంగాణలో మొదలైయ్యాయి.. మరోవైపు కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం ఇన్ని సంవత్సరాలకు ఫలించడం ఆనందాన్ని కలిగిస్తుందని శివకుమార్ పేర్కొన్నారు.
మరోవైపు ఎన్నికలు ముగియగానే రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వస్తాయని ఆరోపించిన డీకే శివకుమార్.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రిసార్ట్ రాజకీయాలు చేసే అవసరం కాంగ్రెస్ (Congress)కు లేదని తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపిన శివకుమార్.. మా ఎమ్మెల్యేలు పార్టీకి విధేయులు. ఎట్టి పరిస్థితిలో ప్రలోభాలకు లొంగరని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపిన ముఖ్యమంత్రి.. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసిందని అన్నారు. కాగా మధ్యప్రదేశ్ లో ఉన్న అవినీతి సర్కార్ ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆరోపించిన డీకే శివకుమార్, అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు.